తొమ్మిదో భర్త.. కత్తితో గొంతు కోసి పరార్..!  

hyderabad, wife, murder, Nagaraju, Varalaxmi, Pahadisharif, SI Kumara Swamy - Telugu Husband, Hyderabad, Murder, Nagaraju, Pahadisharif, Si Kumara Swamy, Varalaxmi, Wife

హైదరాబాద్ నగరంలోని పహాడీఫరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్య కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి.వరలక్ష్మి అనే మహిళను ఆమె భర్త గొంతుకోసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

 Nagaraju Varalaxmi Pahadisharif Si Kumara Swamy

ఆమెను చంపి పరారయ్యాడు భర్త.అయితే పోలీసులు కేసు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగించారు.

విచారణ చేపట్టిన పోలీసులు వరలక్ష్మి చుట్టు పక్కల వారితో మాట్లాడారు.అయితే పోలీసులు విస్తుబోయే జవాబులు వచ్చాయి.వరలక్ష్మి (35)ని గొంతు కోసి చంపిన నాగరాజు(36) ఆమెకు తొమ్మిదో భర్త అని పహాడీషరీఫ్ ఎస్ఐ కుమార స్వామి వెల్లడించాడు.భార్య, భర్తలిద్దరూ తరచూ గొడవపడేవారని, వరలక్ష్మిని నాగరాజు రోజూ కొట్టేవాడని స్థానికులు చెబుతున్నారు.

తొమ్మిదో భర్త.. కత్తితో గొంతు కోసి పరార్..-Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image

నాగరాజుకు భయపడి వరలక్ష్మి స్నేహితుల ఇళ్లలో, చుట్టాల ఇళ్లో దాక్కునేదని పేర్కొన్నారు.అయితే నిన్న రాత్రి కూడా వీరిద్దరి మధ్య గొడవ నెలకొందని పేర్కొన్నారు.ఆ తర్వాత ఏమైందో ఏమో నాగరాజు టెన్షన్ పడుతూ రూంకి తాళం వేసి వెళ్లిపోయడన్నారు.స్థానికులు గమనించి పలుకరించగా వరలక్ష్మి ఉలుకు పలుకు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించామన్నారు.

స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తలుపు తెలిచి చూడగా వరలక్ష్మి గొంతు కోసి రక్తం ఏరులై పారుతోంది.మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించిన విషయం అందరికి తెలిసిందే.

కాగా, పోలీసులు విచారణకు సంబంధించి అన్ని క్లూలను సేకరిస్తున్నారు.త్వరలో నాగరాజును పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పహాడీషరీఫ్ ఎస్ఐ కూమార స్వామి తెలిపారు.

#Murder #SI Kumara Swamy #Nagaraju #Pahadisharif #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagaraju Varalaxmi Pahadisharif Si Kumara Swamy Related Telugu News,Photos/Pics,Images..