కత్తి మహేష్‌కు ఇది శిక్షా? లేదంటే ప్రమోషనా?  

Kathai Mahesh will increase the intensity of the comments on Ram and on Ramayana. The Hindu community and many other communities are also keen on the knife of Mahesh. The latest Hindu community has also been ready for a walk. The Telangana police department decided to boycott the town of Keshri Mahesh with a view to the possibility of peace and security in Hyderabad. The field was ready to hand over the killing of Mahesh to AP police. Katti Mahesh of Chittoor district was handed over to AP police and was ready to warn strenuous action if he returned to Hyderabad.

Kadhai Mahesh is also relegated to Hyderabad by the political parties. The Tea government has banned the Babu government for releasing Kathi Mahesh from Telangana and sending it to AP. Many of the Telugu Desam Chief Ministers are demanding that the Kathai Mahesh deal with the issue. The Telangana government has been harsh in the case of Kathi Mahesh, and now it is interesting to know how the AP government will act.

. Kathai Mahesh has been criticized for some time by AP CM Chandrababu Naidu and Nara Lokesh. At this time, the knife will send Mahesh to Andhra Pradesh where the situation is likely to be serious. Kathai Mahesh is speaking against the majority of Telugu media in the media. That is why the maestro from Vaikappa is coming from the seat of Mahesh MP. Some political analysts have expressed the opinion that the idea of cutting Mahesh to benefit from the expulsion of Hyderabad in this time is going to go to AP.

కత్తి మహేష్‌ తాజాగా రాముడిపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యల తీవ్రత పెరుగుతుంది. హిందు సమాజం మరియు పలు సంఘాల వారు కూడా కత్తి మహేష్‌పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. తాజాగా హిందూ సంఘం వారు పాదయాత్రకు కూడా సిద్దం అయ్యారు...

కత్తి మహేష్‌కు ఇది శిక్షా? లేదంటే ప్రమోషనా?-

ఈ సమయంలోనే హైదరాబాద్‌లో శాంతిభద్రతు అదుపు తప్పే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోలీసు శాఖ కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఏపీ పోలీసులకు కత్తి మహేష్‌ను అప్పగించేందుకు రంగం సిద్దం అయ్యింది. చిత్తూరు జిల్లాకు చెందిన కత్తి మహేష్‌ను ఏపీ పోలీసులకు అప్పగించి, హైదరాబాద్‌కు మళ్లీ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేందుకు రెడీ అయ్యారు.

కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ బహిష్కరణ చేయడం రాజకీయ వర్గాల వారిని కూడా విష్మయానికి గురి చేస్తుంది. కత్తి మహేష్‌ను తెలంగాణ నుండి బహిష్కరించి ఏపీకి పంపించడం వల్ల బాబు ప్రభుత్వంను టీ ప్రభుత్వం ఇరుకున పెట్టినట్లయ్యింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కత్తి మహేష్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

కత్తి మహేష్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగా, ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

కత్తి మహేష్‌ గత కొంత కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే కత్తి మహేష్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపించడంతో అక్కడ పరిస్థితి సీరియస్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కత్తి మహేష్‌ మీడియాలో ఎక్కువగా తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు.

ఆ కారణంగానే వైకాపా నుండి కత్తి మహేష్‌ ఎంపీ స్థానం నుండి ఆశిస్తున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే వ్యాఖ్యలు చేయడం, హైదరాబాద్‌ బహిష్కరణకు గురికావడం ఏపీకి వెళ్లవల్సి రావడం కత్తి మహేష్‌కు లాభం చేకూర్చే అంశం అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...

కత్తి మహేష్‌కు ప్రస్తుతం ఇష్యూతో మరింత పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది.

త్వరలోనే కత్తి మహేష్‌ వైకాపా తీర్థం పుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఇమేజ్‌తో సునాయాసంగానే సీటును ఇచ్చేందుకు జగన్‌ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఏపీ నుండి కూడా కత్తి మహేష్‌ను బహిష్కరిస్తే అప్పుడు ఏం జరుగుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశం.

ఒకవేళ ఏపీ నుండి బహిష్కరణకు గురైతే ఖచ్చితంగా కత్తి మహేష్‌ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, అలా కూడా కత్తి మహేష్‌కు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి కత్తి మహేష్‌కు రాజకీయ ఇమేజ్‌ భారీగా వచ్చే అవకాశం ఉంది.