ఫ్లిప్‌కార్ట్ ‌ను ఉతికారేస్తున్న ఇండియన్ నెటిజన్స్... ఎందుకంటే...!?

భారతదేశ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పొరపాటు చేసేసింది.తాజాగా ఓ వ్యక్తి చేసిన కామెంట్ కు సమాధానమిస్తూ ఫ్లిప్‌కార్ట్ పప్పులో కాలు వేసింది.

 Flipkart Controversy Related To Nagaland, Delivery Services, Flipkart, Nagaland,-TeluguStop.com

భారతదేశంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రం గురించి జరిగిన విషయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ తప్పును చేసింది.ఫ్లిప్‌కార్ట్ ఈ విషయంలో నాగాలాండ్ రాష్ట్రం భారత్ లో లేదని అదో ప్రత్యేకమైన దేశం అని చెప్పి తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఈ విషయం సంబంధించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజెన్స్ విరుచుకుపడ్డ తర్వాత తన తప్పును తెలుసుకొని తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించింది.తెలియకుండా జరిగిన పొరపాటును క్షమించమని కోరింది.

అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

ఓ వ్యక్తి నాగాలాండ్ కు ఎందుకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ డెలివరీ చేయలేక పోతుందని ఓ ప్రశ్న ట్విట్టర్ పూర్వకంగా ప్రశ్నించాడు.ఈ కామెంట్ కు ఫ్లిప్‌కార్ట్ తాము భారతదేశం వెలుపలికి వస్తువులను డెలివరీ చేయమని సమాధానంగా చెప్పింది.

ఇక అంతే ఫ్లిప్‌కార్ట్ సంస్థ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఉతికి ఆరేశారు.ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన అర్థంలేని సమాధానానికి భారతదేశంలో రాష్ట్రమైన నాగాలాండ్ ను గుర్తించకపోవడం చాల విచారకరమని ఫ్లిప్‌కార్ట్ సంస్థపై పెద్ద ఎత్తున విరుచుకపడ్డారు.

అయితే ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన సమాధానానికి లేటుగా రియాక్ట్ అయిన ఫ్లిప్‌కార్ట్ వెంటనే ఆ సమాధానాన్ని డిలీట్ చేసింది.అయితే ఆ సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అందుకు సంబంధించి స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయాయి.దీంతో చేసేదేమీ లేక ఫ్లిప్‌కార్ట్ తమ పొరపాటుకు మన్నించాలని అంటూ క్షమాపణలు కోరింది.

అంతేకాకుండా అది అనుకోకుండా జరిగిన పొరపాటు అని వివరణ ఇవ్వడానికి ట్రై చేసింది.నాగాలాండ్ ప్రత్యేక దేశం కాదని నాగాలాండ్ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి తాము డెలివరీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ స్పష్టంగా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube