నాగచైతన్య - విక్రమ్‌కుమార్‌ - దిల్‌రాజుల ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌

‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేళ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు.

 Nagachaitanya Vikram Kumar Thankyou Movie Release Date Details, Nagachaitanya ,vikram Kumar, Thankyou Movie Release Date, Thankyou Movie, Raashi Khanna, Producer Dil Raju, Bvs Ravi, Malavika Nair-TeluguStop.com

ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది.

నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.బీవీఎస్‌ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే తెలియజేస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube