సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చైసామ్ ఓల్డ్ ఫోన్ కాల్.. ఏమైందంటే?

Nagachaitanya Surprise Call To Samantha From Old Interview Goes Viral After Their Split

కొన్ని జోడీలకు ప్రేక్షకుల్లో ఉండే గుర్తింపు, పాపులారిటీ అంతా ఇంతా కాదు.అలా టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా చైసామ్ జోడీ పేరు తెచ్చుకుంది.

 Nagachaitanya Surprise Call To Samantha From Old Interview Goes Viral After Their Split-TeluguStop.com

పెళ్లి తర్వాత నాలుగు సంవత్సరాల పాటు చైతన్య సమంత అన్యోన్యంగా ఉన్నారు.చైసామ్ విడిపోతారని అభిమానులు సైతం అనుకోలేదు.

పెళ్లి తర్వాత చైతన్య సమంత కలిసి మజిలీ సినిమాలో నటించగా ఆ సినిమా నాగచైతన్య కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

 Nagachaitanya Surprise Call To Samantha From Old Interview Goes Viral After Their Split-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చైసామ్ ఓల్డ్ ఫోన్ కాల్.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి తర్వాత నాగచైతన్య నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

అక్టోంబర్ నెల 2వ తేదీన చైసామ్ విడిపోతున్నట్టు ప్రకటించారు.చైసామ్ ప్రకటనతో అభిమానులు బాధ పడటంతో పాటు అభిమానుల మధ్య వీళ్లిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏమిటనే చర్చ జోరుగా జరిగింది.

ప్రస్తుతం కోర్టులో వీళ్లిద్దరి విడాకుల కేసు నడుస్తోందని తెలుస్తోంది.ఏ కారణం వల్ల విడాకులు తీసుకుంటున్నారో సమంత కానీ చైతన్య కానీ వెల్లడించలేదు.

అయితే జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రోగ్రామ్ కు కొన్నేళ్ల క్రితం రారండోయ్ వేడుక చూద్దాం ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య రకుల్ తో కలిసి హాజరయ్యారు.

షోలో ప్రదీప్ కోరిక మేరకు చైతన్య సమంతకు కాల్ చేసి మాట్లాడారు.ప్రదీప్ చెప్పిన విధంగా ఫోన్ లో చైతన్య ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా నేను సమంతనే ఎందుకు లవ్ చేశానని అడుగుతారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా నేను మరో ఆప్షన్ ఇవ్వలేదని సమంత చెప్పగా నాకు కూడా మరో ఆప్షన్ వద్దని చైతన్య అన్నారు.ఆ తర్వాత సామ్ చైతన్యకు ఐ లవ్ యూ చెప్పారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఏ మాయ చేశావే సినిమా సెట్ లో చైతన్య సమంత తొలిసారి కలుసుకున్నారు.

#RarondoiVeduka #Rakul #KonchemTouch #Split #Ye Maya Chesave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube