శోభిత గురించి అడిగితే అలా రియాక్ట్ అయిన చైతూ.. ఆమె చిన్నపాప అంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య గురించి ఈ మధ్య కాలంలో ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.శోభితతో చైతన్య డేటింగ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది.

 Nagachaitanya Shocking Comments About Shobhita Goes Viral In Social Media , Lal-TeluguStop.com

వైరల్ అయిన వార్తలు చైతన్య అభిమానులను ఒకింత కన్ఫ్యూజన్ కు గురి చేశాయి.థాంక్యూ సినిమాతో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

లాల్ సింగ్ ఛద్దా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతన్య ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే క్రేజీ అని సమాధానం ఇచ్చారు.హీరోయిన్ రాశీ ఖన్నా పేరు చెప్పగా ఆమె మంచి ఫ్రెండ్ అని చైతన్య సమాధానం ఇచ్చారు.

బంగార్రాజు సినిమాలో నటించిన కృతిశెట్టి పేరు చెప్పగా ఆమె చిన్న పాప అని నాగచైతన్య బదులివ్వడం గమనార్హం.

శోభిత పేరు చెప్పగానే చైతన్య మొదట సైలెంట్ గా ఉంటూనే తర్వాత గట్టిగా నవ్వేశారు.

ఆ తర్వాత శోభిత పేరు వింటే కేవలం నవ్వుతాను అని చైతన్య బదులివ్వడం గమనార్హం.శోభిత పేరు చైతన్య నవ్వుతున్నాడంటే వీళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చైతన్య పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే మాత్రమే చైతన్య శోభిత డేటింగ్ రూమర్లు ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.

Telugu Nagachaitanya, Shobhita-Movie

లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగచైతన్య ఖాతాలో సక్సెస్ చేరే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అమీర్ ఖాన్ ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటించారు.నాగచైతన్య పేరు మీదే తెలుగులో లాల్ సింగ్ చద్దా బిజినెస్ జరుగుతోంది.

పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube