పిల్లలు అప్పుడే వద్దంటున్న చైతన్య.. అవాక్కైన సమంత..?  

nagachaitanya samantha ad goes viral in social media Nagachaitnaya, Samantha, Myntra Add, Samantha Pregnant News, Social Media, - Telugu @chay_akkineni, @samanthaprabhu2, Myntra Add, Nagachaitanya Samantha Ad Goes Viral In Social Media, Nagachaitnaya, Samantha, Samantha Pregnant News, Social Media

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఒకరినొకరు పేమించుకొని 2017 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీన పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చైతన్య సమంత పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటికే అనేకసార్లు సమంత గర్భవతి అని వార్తలు వైరల్ అయ్యాయి.

TeluguStop.com - Nagachaitanya Samantha Ad Goes Viral In Social Media

సమంత ఎన్నిసార్లు ఆ వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చినా సమంత గర్భవతి అంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం ఆగలేదు.

గతంలో ఒక నెటిజన్ సమంతను మీరు ఇప్పుడు గర్భవతా.? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించగా తాను పెళ్లైనప్పటి నుంచి గర్భవతినేనని కానీ బేబీ బయటకు రావడం లేదంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.అయితే తాజాగా సమంత, నాగచైతన్య నటించిన ఒక యాడ్ లో పిల్లలు ఇప్పుడే వద్దని చైతన్య చెప్పడం, సమంత అవాక్కవడం జరిగింది.

TeluguStop.com - పిల్లలు అప్పుడే వద్దంటున్న చైతన్య.. అవాక్కైన సమంత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గతంలో పలు యాడ్స్ లో నటించిన చైతన్య సమంత తాజాగా మింత్ర యాడ్ లో మెరిశారు.

ఈ యాడ్ లో సమంత “మీరు రిలాక్స్ అవ్వండి.అందరికీ పండగ షాపింగ్ నేనే చేస్తా” అని చైతన్యతో చెప్పగా ” డోంట్ వర్రీ బేబీ షాపింగ్ నేనే చేస్తున్నా” అని చెప్పి చైతన్య మింత్ర యాప్ ఓపెన్ చేస్తాడు.నాన్నకు కుర్తా, తమ్ముడికి స్టైలిష్ డ్రస్, అమ్మకు హ్యాండ్ క్రాఫ్టెడ్ సారీ కొంటున్నానని చైతన్య చెబుతాడు.

ఆ తర్వాత సమంత చైతన్య చేతిలోని ఫోన్ తీసుకుని పిల్లల సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ” ఈ డ్రస్ లు సూపర్ క్యూట్ గా ఉన్నాయ్ కదా” అంటుంది.వెంటనే నాగచైతన్య “అలాంటి ఆలోచనలు ఇప్పుడే వద్దు” అని చెబుతాడు.

ప్రస్తుతం చైతన్య సమంత నటించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తరచూ సమంత గర్భవతి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెట్టేందుకు సమంత నాగచైతన్య పరోక్షంగా ఇప్పట్లో పిల్లల గురించి ఆలోచించడం లేదని చెప్పేశారు.

#@chay_akkineni #Samantha #Social Media #Nagachaitnaya #Myntra Add

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagachaitanya Samantha Ad Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..