వెండితెరపై కొన్ని జోడీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.ఇలా ఆ కాంబినేషన్ లో సినిమాలు వస్తే ప్రేక్షకులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ఇలాంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లలో సమంత నాగచైతన్య జంట ఒకటనీ చెప్పాలి.వీరిద్దరూ చాలా సినిమాలలో నటించారు.
సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.ఇక నాగచైతన్య ( Nagachaitanya )సాయి పల్లవి( Saipallavi ) కాంబినేషన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందనే విషయం మనకు తెలిసింది.
వీరిద్దరి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో మరోసారి నాగచైతన్య సినిమాలో సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారట.ఈ క్రమంలోనే ఈమెనూ సంప్రదించగా సాయి పల్లవి కూడా దాదాపు నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సాయి పల్లవి తన అభిప్రాయాన్ని తెలియజేయబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
సాయి పల్లవి దాదాపు ఈ సినిమాలో ఖరారు అయిందని తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలబడనుంది.

నాగచైతన్య కస్టడీ ( custody )తర్వాత తన తదుపరి చిత్రాన్ని చందు మొండిటి ( Chandu Mondeti ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈయన స్వయంగా జాలర్లను కలిసి వారి నిజజీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మరోసారి సాయి పల్లవి సందడి చేయబోతుందంటూ ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.
