లవ్‌ స్టోరీ పూర్తి చేస్తారట, మరి విడుదల ఎలా?  

Nagachaitanya And Sai Pallavi LOve Story Movie Complete In This Month Ending, Nagachaitanya, Sai Pallavi, Shekhar Kammula, Tollywood, Love Story, August , Post Production Work, Theaters Open, OTT - Telugu August, Love Story, Nagachaitanya, Ott, Post Production Work, Sai Pallavi, Shekhar Kammula, Theaters Open, Tollywood

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రాన్ని గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు.కాని షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామన్నారు.

 Nagachaitanya Sai Pallavi Shekhar Kammula

ఫిబ్రవరిలో కూడా షూటింగ్‌ పూర్తి అవ్వక పోవడంతో ఏప్రిల్‌కు సినిమాను వాయిదా వేశారు.ఈ సమయంలోనే కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయింది.

రెండు వారాల పాటు షూటింగ్‌ జరిపితే పూర్తి అవుతుంది అనుకుంటూ ఉండగా కరోనా వచ్చి మొత్తం ప్లాన్స్‌ రివర్స్‌ చేసింది.

లవ్‌ స్టోరీ పూర్తి చేస్తారట, మరి విడుదల ఎలా-Movie-Telugu Tollywood Photo Image

కరోనా కారణంగా ఆగిన సినిమాను మళ్లీ మొదలు పెట్టి పూర్తి చేయాలనే నిర్ణయానికి శేఖర్‌ కమ్ముల వచ్చాడు.

సినిమా ఈ నెల చివరి నుండి లేదా వచ్చే నెల ఆరంభం నుండి షూటింగ్‌ చేసే అవకాశం ఉందట.ఆగస్టు చివరి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారట.

మరి ఇంత హడావుడిగా సినిమాను పూర్తి చేయడానికి కారణం ఏంటీ అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాదిలో సినిమాల విడుదలకు సంబంధించి ఎలాంటి ఆశ లేదు.థియేటర్లు జులై అన్నారు, ఇప్పుడు ఆగస్టులో కూడా ఓపెన్‌ చేసే అవకాశం కనిపించడం లేదు.ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం లేదంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో లవ్‌ స్టోరీ సినిమాను హడావుడిగా పూర్తి చేస్తున్నారంటే ఓటీటీ విడుదలకు ఏమైనా ప్లాన్‌ చేస్తున్నారా అంటూ టాక్‌ వినిపిస్తుంది.మరి శేఖర్‌ కమ్ముల ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.

#Theaters Open #Sai Pallavi #August #Nagachaitanya #OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagachaitanya Sai Pallavi Shekhar Kammula Related Telugu News,Photos/Pics,Images..