నాగచైతన్య దృష్టిలో తన కెరీర్ లో చెత్త సినిమా ఏదో తెలుసా?

అక్కినేని హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.నాగచైతన్య తొలి సినిమా జోష్ దిల్ రాజు నిర్మాతగా వాసువర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 Nagachaitanya Comments About Josh Movie Details, Naga Chaitanya, Josh Movie, Nag-TeluguStop.com

యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.ఈ సినిమా గురించి తాజాగా నాగచైతన్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నా తొలి మూవీ జోష్ రిలీజైన సమయంలో ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని థియేటర్ కు వెళ్లానని చైతన్య తెలిపారు.

సినిమా స్టార్టింగ్ సమయంలో జోష్ మూవీని అందరూ ఎంజాయ్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా సగానికి వచ్చే సమయానికి ఆడియన్స్ లో చాలామంది థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోవడం చూశానని నాగచైతన్య వెల్లడించారు.ఆ ఘటన నా హృదయాన్ని గట్టిగా తాకిందని చైతన్య చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో నేను ఎంతో బాధ పడ్డానని చైతన్య వెల్లడించారు.ప్రేక్షకులను అలరించడానికి నేను ఇండస్ట్రీలో ఉన్నానని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

అయితే అలా చేయడం నా వల్ల సాధ్యం కాదని అనిపించిందని నాగచైతన్య అన్నారు.

Telugu Josh, Nagachaitanya, Dil Raju, Tollyood-Movie

ఆ అనుభవం నన్ను ఎంతగానో భయపెట్టిందని నాగచైతన్య చెప్పుకొచ్చారు.ఆ అనుభవం నాకెన్నో విషయాలను నేర్పించిందని చైతన్య తెలిపారు.ఆ తర్వాత నేనెప్పుడూ థియేటర్ కు వెళ్లలేదని చైతన్య కామెంట్లు చేశారు.

ఆ ఘటన నా మైండ్ నుంచి పోలేదని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

Telugu Josh, Nagachaitanya, Dil Raju, Tollyood-Movie

అయితే ఏదో ఒకరోజు థియేటర్ కు వ్లెళ్లి ప్రేక్షకుల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నానని నాగచైతన్య తెలిపారు.నాకు కంగారు ఎక్కువని నాగచైతన్య అన్నారు.కొన్ని సీన్లకు ప్రేక్షకులు స్పందించకపోయినా కొన్ని సీన్లకు ప్రేక్షకులు నవ్వకపోయినా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానని నాగచైతన్య అన్నారు.

ఒక విధంగా జోష్ తన సినీ కెరీర్ లో చెత్త సినిమా అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube