నాగ చైతన్య, సమంత కల త్వరలో నెరవేరబోతుందట.. అసలేమైందంటే..?

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా నాగచైతన్య, సమంత జోడీ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.సినిమాలు, వెబ్ సిరిస్ లతో విజయాలు సాధిస్తూ సమంత జోరుమీదున్నారు.

 Nagachaitanya And Samanths Dream House In Goa, Dream House , Goa , Nagachitanya-TeluguStop.com

అయితే ఈ స్టార్ జోడీ కల త్వరలోనే తీరబోతుందని తెలుస్తోంది.చైతన్య, సమంతలకు గోవా ఇష్టమైన హాలిడే స్పాట్ కాగా చైతన్య, సమంతల వివాహం గోవాలోనే జరిగిందనే సంగతి తెలిసిందే.

ఈ జోడీ ప్రస్తుతం గోవాలో విలాసవంతమైన బీచ్ హౌస్ ను కొనుగోలు చేశారని సమాచారం.

టైమ్ దొరికిన ప్రతిసారి గోవాకు వెళ్లడానికి చైతన్య, సమంత ఇష్టపడతారు.

చైతన్య, సమంత కలలు కన్న ప్లేస్ దొరకడంతో ప్రస్తుతం అక్కడ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని సమాచారం.సమంత, చైతన్య వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉన్నారు.సమంత నటిస్తున్న శాకుంతలం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.అల్లు అర్హ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా వచ్చే ఏడాది శాకుంతలం రిలీజ్ కానుంది.

Telugu Dream, Lal Chand, Nagachaitanya, Samantha, Shkunthlam, Thanku, Tollywood-

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమంతకు పాన్ ఇండియా నటిగా గుర్తింపును సంపాదించి పెట్టింది.మరోవైపు నాగచైతన్య సైతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా నాగచైతన్య కెరీర్ కు ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Telugu Dream, Lal Chand, Nagachaitanya, Samantha, Shkunthlam, Thanku, Tollywood-

మరోవైపు చైతన్య వచ్చే నెల నుంచి థ్యాంక్యూ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.మనం తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేని విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం గమనార్హం.థ్యాంక్యూ మూవీ వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube