జనాన్ని చెడగొట్టే గొప్పవాళ్ళు లేరిక్కడంటూ నాగబాబు ట్వీట్.. మంచి ఎంటర్టైన్ అయ్యాయంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన ఎన్నో సినిమాలలో చేసి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Nagababus Tweet Saying That There Are Great People Who Spoil People Trolls Who S-TeluguStop.com

నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు.ఇప్పటికీ వెండితెరపై పలు సహాయ పాత్రలలో నటిస్తున్నాడు.

కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షోలో జడ్జిగా కూడా చేశాడు.వెండితెరపై నటుడిగా 50కి పైగా సినిమాలలో నటించాడు.

నిర్మాతగా ఎనిమిది సినిమాలకు బాధ్యతలు చేపట్టాడు.చివరగా ఆరంజ్ సినిమాలో నిర్మాత గా బాధ్యతలు చేపట్టగా ఈ సినిమా ఆయనను బాగా నిరాశపరిచింది.

దీంతో ఆ తర్వాత ఈయన నిర్మాతగా బాధ్యతలను వదులుకొని బుల్లి తెర పై వరుస షో లలో జడ్జిగా చేశాడు.

ఇక రాజకీయపరంగా ఈయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరి 2019 నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేశాడు.కానీ ఈయన వైసీపీ, తెలుగుదేశం తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.ఇప్పటికీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయంగా కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాడు.

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన నాగబాబుకు ఆ తర్వాత బుల్లితెరపై అంతగా కలిసి రాలేదు.అలా కొంతకాలం బుల్లితెరకు బ్రేక్ ఇవ్వగా మళ్లీ ఆ మధ్య పలు షోలలో, ఈవెంట్లలో దర్శనమిస్తూ బాగా సందడి చేసాడు.

ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయాల వైపు దారి మళ్లడంతో ఆయన బుల్లితెరకు దూరమయ్యాడు.ఇక ఈయన ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా.సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటాడు.నిత్యం ఏదో ఒక టాపిక్ తో బాగా హల్ చల్ చేస్తాడు.

ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తో అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు.నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తాడు.మధ్య మధ్యలో తన మీమ్స్ తో నెటిజన్లను తెగ నవ్విస్తుంటాడు.

సోషల్ మీడియాలో ఎక్కువగా రాజకీయాన్ని కూడా చేస్తుంటాడు నాగబాబు.వైసీపీ పార్టీని ఉద్దేశించి ఏదో ఒక కామెంట్లు చేస్తూనే ఉంటాడు.

ఇతర విషయాల గురించి కూడా బాగా రియాక్ట్ అవుతూ ఉంటాడు.అయితే తాజాగా మరో విషయంతో ట్విట్టర్ ద్వారా ముందుకు వచ్చాడు.

ఇక ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే.సినిమాల్లో చూపించే వైలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే.

మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా అంటూ.

ఒక నిర్మాతగా చెబుతున్నాను అని.సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే, జనాన్ని బాగు చేయడం కోసమే.కానీ చెడగొట్టడం కోసం తీసేంత గొప్ప వాళ్ళు లేరిక్కడ.

ఇది కేవలం బిజినెస్ అంటూ ట్వీట్ చేయగా వెంటనే కొందరు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.ఎన్నాళ్లు సినిమాలే ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం.

మీ తమ్ముడు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చాక.రాజకీయాలు కూడా సినిమాలకు మంచి ఎంటర్టైన్ అయిపోయాయి రా బుష్ బాబు అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube