కాస్కో బాలయ్య ...! ఆయనపై పోటీకి సై అంటున్న నాగబాబు ..?  

 • బాలయ్య అంటే నాకు ఎవరో తెలియదు అని … నాకు తెలిసిన బాలయ్య మంచి కమెడియన్ అని నాగబాబు ఆ మధ్య హీరో బాలకృష్ణ గురించి పంచ్ వేశారు. ఆ పంచ్ నుంచి తేరుకునేలోపే … సోషల్ మీడియా లో వరుస వరుస పోస్టింగ్స్ పెడుతూ నాగబాబు తరుచు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు.

 • బాలయ్య తరుచు మాట్లాడే మాటలైనా … బ్లడ్డు … బ్రీడ్ గురించి కూడా నాగబాబు పోస్టింగ్ పెట్టారు. ఓ దున్నపోతు ఫోటో, ఓ కుక్క బొమ్మ పెట్టి … వీటి బ్లడ్ , బ్రీడు చాలా స్పెషల్ అంటూ బాలయ్యను కవ్వించే ప్రయత్నం చేసాడు. ఇలా వరుస వరుసగా బాలయ్య మీద నాగబాబు పరోక్ష కామెంట్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనే విషయంపై ఇప్పుడు పొలిటికల్ సెక్టార్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక ఈ ఇద్దరి మధ్య వైరం మెగా … నందమూరి ఫ్యాన్స్ మధ్యన కూడా వైరం పెంచింది.

 • Nagababu Wants To Participate In Elections Against Balakrishna-Nagababu Nagababu And Balakrishna Controvercy Comments On Pawan Kalyan Janasena Tdp Trolls

  Nagababu Wants To Participate In Elections Against Balakrishna

 • నాగబాబు ప్రస్తుతం… అనేక రాజకీయ అంశాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రో హిందూత్వ భావజాలంతోనూ గతంలో పోస్టులు పెట్టారు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికలకు వెళ్ళినప్పటికంటే… ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఎన్నికలకు వెళ్తున్న సమయంలో నాగబాబు మరింత యాక్టివ్ కావాలని తపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు నాగబాబుకు ప్రస్తుత సమయంలో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా బాగా ఎక్కువగా ఉందట.

 • టీవీ షోల ద్వారా తనకు ఉన్న పరిచయాలను బాగా ఉపయోగించుకుని తనకంటూ… ఒక వర్గాన్ని తయారుచేసుకున్ననాగబాబు వారిని ప్రచారంలో వాడుకుంటూ, తమ్ముడు పవన్ పట్ల ఉన్న క్రేజ్‌ను వాడుకుంటూ… ఎన్నికల్లో విజయం సాధించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

 • ఆ ఉత్సాహంతోనే … జనసేన నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకోవాలని ఉర్రులుగుతున్నాడు. దీనిలో భాగంగానే… ఆయన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పోటీ చేయాలని చూస్తున్నాడట. దేనిలో భాగంగానే… ఇప్పటి నుంచే బాలయ్యను టార్గెట్ చేసుకుంటూ … తన బలం పెంచుకునే ఆలోచనలో ఉన్నాడట.

 • Nagababu Wants To Participate In Elections Against Balakrishna-Nagababu Nagababu And Balakrishna Controvercy Comments On Pawan Kalyan Janasena Tdp Trolls
 • ఈ విషయంలో జనసేన అధినేత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు…. అందుకే నాగబాబు బ్రేకుల్లేనిబండిలా దూకుడుగా వెళ్తున్నట్టు తెలుస్తుందో. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే… ? బాలయ్య మీద నాగబాబు పోటీ చేద్దామని సంబరపడుతున్నా… టీడీపీ లో ఈ సారి బాలయ్యకు హిందూపూర్ టికెట్ రాకపోవచ్చని… ఆయనను పార్లమెంట్ కి పంపే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే నాగబాబు ఏ స్టెప్ తీసుకుంటాడో …?

 • అయితే బాలయ్యకు ఈసారి టీడీపీలో హిందూపురం ఎమ్మెల్యే టిక్కెట్ రాదని ఆయన్ను లోక్ సభకు పోటీ చేయిస్తారన్న ప్రచారం ఒకటుంది. మరి నాగబాబు అందుకు కూడా సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.