వాల్మీకి జయంతి సందర్భంగా గద్దలకొండ సినిమాని గుర్తుచేసిన నాగబాబు

సినిమాలలో ఏదైనా ఒక అంశాన్ని టచ్ చేస్తే దాన్ని వివాదం చేసి పబ్బం గడుపుకునే బ్యాచ్ లు చాలా ఉంటాయి.కావాలని సినిమాపై రచ్చ చేస్తూ మీడియాలో కనిపిస్తారు.

 Nagababu Tweets On Valmiki Jayanti, Tollywood, Telugu Cinema, South Cinema, Gadd-TeluguStop.com

అసలు అందులో ఎలాంటి వివాదం లేకపోయినా ఏదో ఒక కారణం చూపించి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ హడావిడి చేస్తారు.ఇలాంటి బ్యాచ్ లు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ అయిపోయాయి.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ పైన కూడా అలాంటి వివాదాన్నే సృష్టిస్తున్నారు.కొమురం భీమ్ ని ముస్లింగా ఎలా చిత్రీకరిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ హడావిడిపై రాజమౌళి ఎలాంటి వివరణ ఇచ్చే పనిలో లేరు.గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో కూడా ఇలాగే వివాదం చేశారు.

ఆ సినిమాకి ముందుగా వాల్మీకి అని పేరు పెట్టారు.రౌడీ పాత్రని ఎలివేట్ చేస్తూ అలాంటి కథకి వాల్మీకి అని పేరు పెట్టడం ఏంటని ఒక వర్గం వారు ఆందోళన చేశారు.

వాల్మీకి పాత్ర గొప్పతనం దెబ్బతీస్తున్నారు అంటూ హడావిడి చేశారు.దీంతో తప్పనిసరి పరిస్థితిలో సినిమాకి వాల్మీకి అనే టైటిల్ ని చివరి నిమిషంలో మార్చి గద్దలకొండ గణేష్ అని పెట్టారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి నాగబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.ఆరోజు వాల్మీకి అని టైటిల్ పెడితే గొడవ చేసేశారు కదా అని పేర్కొన్నారు.మరి వాళ్లకి ఈ రోజు వాల్మీకి జయంతి అని గుర్తుండే ఉంటుంది అనుకుంటున్న అని కౌంటర్ వేశారు.

ఏదేమైనా హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారూ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్లలో మీరే ప్రథములు.

రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube