అల్లుడికి నాగబాబు సర్ప్రైజ్ గిఫ్ట్... అదేంటో తెలిస్తే?

మెగాబ్రదర్ నాగబాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.మెగా బ్రదర్ నాగబాబుగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ అన్నగా మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు సుపరిచతమే.

 Nagababu Surprise Gift To Daughter Niharika And Chaitanya, Nagababu, Niharika Ko-TeluguStop.com

ఇంకా తొందరగా ఇప్పటితరం వారికి అర్థం కావాలంటే జబర్దస్త్ నాగబాబు అంటే అర్థమవుతుంది.మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా సినీ రంగ ప్రవేశం చేసినా కొన్ని కొన్ని సినిమాలలో నటించి నటుడిగా కొద్దిపాటి సత్తా చాటినా నిర్మాతగా మాత్రం ఫెయిల్ అయి మానసికంగా క్రుంగి పోయిన పరిస్థితి ఉంది.

ఆ తరువాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల అండతో ఆర్థిక కష్టాల నుండి బయటపడ్డ సంగతి తెలిసిందే.ఇది ఒక వైపు అయితే డిసెంబర్ 9న నాగబాబు గారాలపట్టి నిహారిక కు వివాహం జరిపించిన విషయం తెలిసిందే.

నిహారిక పెళ్లి వేడుక మాత్రం నెట్టింట్లో పెద్దగా వైరల్ అయిందనే చెప్పుకోవచ్చు.అయితే నాగబాబు తన అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

పెళ్లి అయిన తరువాత ఏమీ ఇవ్వలేదని, ఉగాది కానుకగా ఇద్దామని అనుకున్నా ఇవ్వలేకపోయానని ఇక ఇవ్వడానికి తగిన సమయం దొరికిందని నాగబాబు తెలిపాడు.నాగబాబు తన అల్లుడికి 70 లక్షల రూపాయల విలువ గల కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఇక తన ఆనందాన్ని వీడియో రూపంలో నాగబాబు పంచుకున్నాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube