ఊపిరాడక ఇబ్బంది పడ్డానంటున్న నాగబాబు!  

Nagababu Faced Breathing Problems during Quarantine, Covid Positive, Home Quarantine, Nagababu, Asthma, Mega Brothers - Telugu Asthma, Breathing Problem, Corona Virus, Covid Positive, Home Quarantine, Mega Brothers, Nagababu, Nagababu Faced Breathing Problems During Quarantine, Quarantine, Suffered

సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక నిశ్చితార్థం ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

TeluguStop.com - Nagababu Suffered By Having Breathing Problem

అయితే నిశ్చితార్థం అనంతరం నాగబాబు కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసినదే.నాగబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కొంతమేర ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు.
కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన నాగబాబు.వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.కరోనా నిర్ధారణ అయిన సమయంలో తాను ఎంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడో.తాజాగా ఆయన వెల్లడించారు.

ఏమాత్రం కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స చేయించుకోవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా నాగబాబు తెలియజేశారు.
నాగబాబుకు ఆస్తమా ఉండటంతో కరోనా సమయంలో ఎంతో కంగారు పడ్డారు.

TeluguStop.com - ఊపిరాడక ఇబ్బంది పడ్డానంటున్న నాగబాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కరోనా వల్ల మొదట్లో శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు, తరువాత రెండు రోజులకు రుచిని కూడా కోల్పోవడంతో కరోనా పరీక్షలు చేయించుకొని ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స చేయించుకున్నారు, సరైన సమయంలో మందులు వాడటం ద్వారా వ్యాధి నుంచి త్వరగా కోలుకున్నారు.అయితే నాగబాబు భార్య కూడా కరోనా బారిన పడడం ద్వారా వీరిద్దరూ స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా నుంచి విముక్తి పొందారు.

ఇదివరకే నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్న నిహారిక డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనుంది.నిహారిక వివాహం ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన జొన్నలగడ్డ చైతన్యతో డిసెంబర్ లో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైంది.

కొద్ది రోజుల క్రితం నిహారిక తన ఫ్రెండ్స్ తో గోవా వెళ్లి బ్యాచిలర్ పార్టీ ని కూడా చేసుకున్న విషయం తెలిసిందే.

#Quarantine #NagababuFaced #Nagababu #Home Quarantine #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagababu Suffered By Having Breathing Problem Related Telugu News,Photos/Pics,Images..