నాగబాబు ఇంకా ఇంకా లాగుతూనే ఉన్నాడు.. ఇలా ఎందుకో?

ఈమద్య కాలంలో నాగబాబు మరీ దురుసుగా మాట్లాడుతున్నాడు.మెగా ఫ్యామిలీ మీదకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదలకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు.

 Nagababu Shows Valluri Balakrishna Photo About Balayya Issue-TeluguStop.com

ఆమద్య వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు వివాదాన్ని లాగి లాగి వదిలేశాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో అంటూ తెలియదు అని, బాలకృష్ణ అనే పేరు నేను ఎప్పుడు వినలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు నందమూరి ఫ్యాన్స్‌కు తీవ్రమైన కోపాన్ని తెప్పించాడు.

ఏమాత్రం ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్‌ రగిలి పోతున్న నేపథ్యంలో నాగబాబు మళ్లీ నిప్పు రాజేసేలా మాట్లాడాడు.

తాను గత ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నానని, అలా అన్నందుకు చాలా మంది ఇబ్బంది పడ్డట్లుగా నా దృష్టికి వచ్చింది.అలా అన్నందుకు సారీ.నాకు బాలయ్య బాగా తెలుసు.

ఆయన మంచి నటుడు, ఆయనో పెద్ద కమెడియన్‌, ఆయన నవ్వులు పూయించిన వ్యక్తి అంటూ ఆశ్చర్యకరంగా మాట్లాడి అందరికి షాక్‌ ఇచ్చాడు.చివరకు తాను మాట్లాడేది వళ్లూరి బాలకృష్ణ గురించి అంటూ ఆయన ఫొటో చూపించి మళ్లీ సంచలనానికి మారు పేరుగా నిలిచాడు.

బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఇప్పటికే ఆగ్రహంతో ఉండగా నాగబాబు చేసిన పనికి అంతా కూడా అవాక్కవుతున్నారు.మళ్లీ మళ్లీ ఎందుకు బాలయ్యను నాగబాబు టార్గెట్‌ చేస్తున్నట్లు అంటూ అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.నాగబాబు ఎందుకు నందమూరి ఫ్యామిలీతో వివాదాన్ని పెట్టుకుంటున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube