రామ్ గోపాల్ వర్మ చనిపోయి 20 ఏళ్ళు అయ్యింది అంటూ నాగబాబు సంచలన కామెంట్స్!

వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ,( Ram Gopal Varma ) లేటెస్ట్ గా తీసిన మరో వివాదాస్పద చిత్రం ‘వ్యూహం ‘.( Vyuham Movie ) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను అంశాలుగా తీసుకొని, జగన్ కి సపోర్టుగా,( Jagan ) టీడీపీ – జనసేన కి వ్యతిరేకంగా, చాలా నీచంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరక్కించాడు.

 Nagababu Shocking Post On Director Ram Gopal Varma Details, Nagababu , Director-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.అయితే ఈ సినిమా కి వ్యతిరేకంగా టీడీపీ మరియు జనసేన( TDP Janasena ) మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.

రీసెంట్ గా ఒకరు లైవ్ డిబేట్ కి వచ్చి, రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చి ఇచ్చేవాడికి బహుమానం అందిస్తాను అని ఛాలెంజ్ చేసాడు.దీనికి రామ్ గోపాల్ వర్మ నాకు ప్రాణహాని ఉంది అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసాడు.

Telugu Ram Gopal Varma, Janasena, Nagababu, Nagababuram, Nagababu Rgv, Rgv Contr

దీనికి జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు( Konidela Nagababu ) చాలా వ్యంగ్యంగా రెస్పాన్స్ ఇచ్చాడు.మీ ప్రాణాలకు ఎవరి హాని తలపెడుతారో అనే భయం అసలు అక్కర్లేదు రామ్ గోపాల్ వర్మ గారు, ఎందుకంటే హీరోలు విలన్లు కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చే కమెడియన్స్ ని ఎవ్వరూ పట్టించుకోరు కదా, కాబట్టి నిశ్చింతగా ఉండండి అంటాడు.దానికి రాంగోపాల్ వర్మ సమాధానం చెప్తూ ‘సార్.నా కంటే పెద్ద కమెడియన్( Comedian ) ఎవడంటే, నా సినిమాలో మీరు.ఎక్కువ ఆలోచించకుండా మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ త్రాగి పడుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.దీనికి నాగబాబు ఫేస్ బుక్ లో ఇచ్చిన కౌంటర్ మాములు రేంజ్ లో లేదు.

చూస్తే రామ్ గోపాల్ వర్మ కి బీపీ పీక్ రేంజ్ కి చేరిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Telugu Ram Gopal Varma, Janasena, Nagababu, Nagababuram, Nagababu Rgv, Rgv Contr

ఇంతకీ నాగబాబు దీనికి ఏమి కౌంటర్ ఇచ్చాడంటే ‘ వర్మ గారు.మీరు నా పోస్ట్ కి స్పందించడం నాకు చాలా ఆనందం గా ఉంది.అంతే కాకుండా నేను షాక్ కి కూడా గురి అయ్యాను, ఎందుకంటే మీరు చనిపోయి 20 ఏళ్ళు అయ్యింది.

కేవలం మీ ఆత్మ మాత్రమే ఇక్కడ తిరుగుతూ ఉంది.అది మీరు గ్రహించాలి, కానీ ఎదో ఒక రూపం లో నాకు సమాధానం ఇచ్చారు ,సంతోషం.మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ నాగబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.దీనికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇస్తాడా, లేదా వదిలేస్తాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube