బ్రహ్మానందం ఇండస్ట్రీలో లేకుంటే అంటూ నాగబాబు షాకింగ్ కామెంట్స్?

Nagababu Shocking Comments About Brahmanandam

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.

 Nagababu Shocking Comments About Brahmanandam-TeluguStop.com

కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలలో కమెడియన్ బ్రహ్మానందం లేని సినిమా లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే రాను రాను బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించేశారు.ఇలా ఉంటే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కమెడియన్ బ్రహ్మానందం పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

 Nagababu Shocking Comments About Brahmanandam-బ్రహ్మానందం ఇండస్ట్రీలో లేకుంటే అంటూ నాగబాబు షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే బుల్లితెరపై దావత్ అనే ప్రోగ్రాంను నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే.ఈ ప్రోగ్రాం స్పెషల్ గెస్ట్ గా బ్రహ్మానందం వచ్చారు.సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ, తనలో ఉన్న కమెడియన్ ను మరొకసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వేదికపై తన మాటలు హావభావాలతో దర్శకులను కడుపుబ్బా నవ్వించారు.బ్రహ్మానందాన్ని అలా చూసిన నాగబాబు తన మనసులోని మాటలను బయటపడుతూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో రేలంగి తరువాత బ్రహ్మానందం అనేవాడు తెలుగు ఇండస్ట్రీకి రాకుంటే తెలుగు సినిమా అనేది ఉప్పులేని కూర లా ఉండేది.ఉప్పు లాగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మహానుభావుడు అంటూ బ్రహ్మానందాన్ని ఉద్దేశిస్తూ నాగబాబు కామెంట్ చేశారు.

అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సినిమాలలో బ్రహ్మానందాన్ని మిస్ అయినప్పటికీ మీమ్స్ ద్వారా అతన్ని డైలీ చూస్తున్నాము అని చెప్పుకొచ్చారు నాగబాబు.బ్రహ్మానందం ప్రత్యేకంగా దానధర్మాలు చేయాల్సిన పనిలేదని, ఆయన కామెడీ చూసి నవ్విన ప్రతి వాడు చేసే పుణ్యం ఆయనకు వచ్చేస్తుంది.అలాంటి ధన్య జీవి బ్రహ్మానందం అంటూ తెగ పొగిడేశారు నాగబాబు.

బ్రహ్మానందం అనే వ్యక్తి తెలుగులో నెంబర్ వన్ కమెడియన్.ఆయన తర్వాత కానీ ముందు కానీ ఎవరూ లేరు.అంతేకాకుండా బ్రహ్మానందాన్ని రిప్లేస్ చేసే వ్యక్తిని మా జనరేషన్ లో చూడలేకపోవచ్చు.

ఎందుకు అంటే నవ్వు అనేదానికి కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం గారు.దట్ ఈజ్ బ్రహ్మానందం అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagababu Shocking Comments About Brahmanadam Details, Nagababu, Brahmanandam, Comment, Tollywood, Film Industry, Daawat Program, Mega Brother Nagababu, Comedian Brahmanandam, Tollywood Industry, Relangi - Telugu Brahmanandam, Daawat Program, Nagababu, Relangi, Tollywood

#Brahmanandam #Brahmanandam #Daawat Program #Relangi #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube