కూతురు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు... వావ్‌ మెగా బ్రదర్‌ అనిపించుకున్నాడు  

మెగా బ్రదర్‌ నాగబాబు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో ఈయన వీడియోలకు రెస్పాన్స్‌ భారీగా వస్తుంది. అదే సమయంలో ఈయనపై నెగటివ్‌ కామెంట్స్‌ చేసే వారు కూడా ఎక్కువ అయ్యారు. తనపై వస్తున్న విమర్శలను లెక్క చేయను అంటూ చెబుతూ వస్తున్న నాగబాబు తాజాగా తన కూతురు విషయంలో ఆసక్తికర విషయాన్ని బయటకు చెప్పి అందరిని ఆశ్చర్యంకు గురి చేశాడు. ఈ ఏడాదిలో నిహారిక వివాహం జరుగబోతుందని ప్రకటించాడు.

Nagababu Sensational Decision On His Daughter Niharika-Nagababu Nagababu About Niharika Marriage Niharika Konidela Trolls Varun Tej

Nagababu Sensational Decision On His Daughter Niharika

నిహారిక సినిమాల్లో నటించాలని నన్ను కోరింది, అందుకు నేను ఒక తండ్రిగా ఓకే చెప్పాను. తనకు నటనపై ఉన్న ఆసక్తితో ప్రోత్సహించాను. తనకు ముందే 2018 తర్వాత పెళ్లి చేస్తానంటూ చెప్పాను. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన గడువు పూర్తి అయ్యింది. 2019 అంటే ఈ ఏడాదిలో నిహారిక పెళ్లి చేయబోతున్నాను. పెళ్లి కొడుకు ఎవరు అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బయట సంబంధం చూస్తున్నామని, మా కులంలో అబ్బాయి దొరికితే పర్వాలేదు, బయట కులంలో అబ్బాయి అయినా పర్వాలేదు. మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు అంటూ కూతురు పెళ్లికి సంబంధించిన ప్లాన్స్‌ గురించి నాగబాబు చెప్పుకొచ్చాడు.

Nagababu Sensational Decision On His Daughter Niharika-Nagababu Nagababu About Niharika Marriage Niharika Konidela Trolls Varun Tej

నాగబాబు కూతురు నిహారిక ప్రస్తుతం ‘సూర్యకాంతం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. దాంతో పాటు రెండు మూడు వెబ్‌ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. వరుసగా సినిమాల్లో నటించకుండా ఆచితూచి నటిస్తున్న నిహారిక నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం నిహారిక సినీ కెరీర్‌ సాఫీగా సాగుతున్నా ఆమెకు కమర్షియల్‌ బ్రేక్‌ మాత్రం రాలేదు. ఈలోపు పెళ్లి అంటూ నాగబాబు క్రటించాడు. మరి పెళ్లి తర్వాత నిహారిక నటిస్తుందా చూడాలి.