మీడియాపై తన కోపాన్ని చూపించిన నాగబాబు! చిరంజీవి అలా టార్గెట్ చేసారంట  

మీడియాపై విమర్శలు చేసిన నాగబాబు..

Nagababu Sensational Comments On Telugu Media-

ఓ వైపు ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ తన సత్తా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎన్నికల బరిలో పోటీ చేసాడు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత నాగబాబు రాజకీయంగా మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు..

మీడియాపై తన కోపాన్ని చూపించిన నాగబాబు! చిరంజీవి అలా టార్గెట్ చేసారంట -Nagababu Sensational Comments On Telugu Media

ఇక అప్పుడప్పుడు సంచలన వాఖ్యలతో హడావిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో సారి నాగబాబు ఓ మీడియా ఇంటర్వ్యూలో సంచలన వాఖ్యలు చేసారు. మెగా ఫ్యామిలీని, చిరంజీవిని మీడియా ఎక్కువ టార్గెట్ పెట్టి మానసిక క్షోభకి గురి చేసిందని, తమ కుటుంబానికి మీడియా చేసినంత అన్యాయం ఎవరు చేయలేదని చెప్పుకొచ్చారు.

అయితే ఈ మాటలు నాగబాబు అనడానికి కారణం ఉంది. గతంలో శ్రీజ పెళ్లి విషయంలో మీడియా పెద్ద రాద్దాంతం చేసి టీఆర్పీ రేటింగ్స్ కోసం మెగా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కి కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎవరెవరినో మీడియా ముందుకి తీసుకొచ్చి వారితో పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టించడం.

అలాగే పెళ్ళిళ్ళ గురించి పదే పదే ట్రోల్ చేస్తూ వచ్చింది. ఇలా మానసికంగా మీడియా మెగా ఫ్యామిలీ మీద చేసిన దాడిని నాగబాబు తన ఆవేదనలో తెలియజేసినట్లు తెలుస్తుంది.