రాజకీయ విప్లవం శంఖారావం వారాహి అంటున్న నాగబాబు..!!

జూన్ 14వ తారీఖు నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) “వారాహి” యాత్ర( Varahi ) ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.ఉభయగోదావరి జిల్లాలలో సాగనున్న ఈ యాత్ర.

 Nagababu Sensational Comments On Pawan Kalyan Varahi Yatra Details, Nagababu, Pa-TeluguStop.com

ఒక్కో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రెండు రోజులు పర్యటించబోతున్నారు.అయితే ఈ యాత్ర గురించి జనసేన పార్టీ( Janasena Party ) ప్రధాన కార్యదర్శి కే నాగబాబు( Nagababu ) సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన విడుదల చేశారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలుదేరుతోంది వారాహి.జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టనున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది.

జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.

Telugu Ap, Janasena, Nagababu, Pawan Kalyan, Pawankalyan, Varahi-Telugu Politica

రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది.ప్రజలు కలిసి మెలసి జీవించే వాతావరణాన్ని కల్పించడానికి ఏర్పడిన రాజకీయం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడదీస్తూ ఒక్కో పార్టీ, ఒక్కో నాయకుడు వారికి ఇష్టమొచ్చిన రీతిలో వాడేసుకుంటున్నారు.రాజకీయం అంటే అసలు నిర్వచనాన్ని అమలు చేయడానికి, ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అనే ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగానే వేలాదిమందికి ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంది.

Telugu Ap, Janasena, Nagababu, Pawan Kalyan, Pawankalyan, Varahi-Telugu Politica

ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్ధత నిబద్ధత గల నాయకుడు, నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది.రాజకీయాల్లో, రాష్ట్ర పరిపాలన విధానాల్లో ఖచ్చితమైన జవాబుదారీతనం జనసేనతో మాత్రమే సాధ్యం అవుతుందనేది మేధావి వర్గాల అభిప్రాయం.పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆటు పోట్లను తట్టుకొని పదేళ్లుగా పార్టీని నడిపిస్తున్న నాయకత్వ పటిమతోనే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించగలరు.పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం.

చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం”.అని నాగబాబు సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube