సుధీర్ పరువు తీసిన నాగబాబు.. అసలేం జరిగిందంటే..?

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి భారీగా పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఒకరు.స్వయంకృషితో ఎవరూ ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న సుధీర్ కు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

 Mega Brother Nagababu Sensational Comments About Sudigali Sudheer, Sudigali Sudh-TeluguStop.com

సుధీర్ చేసిన టీవీ షోలు, ఈవెంట్లలో ఎక్కువ షోలు, ఈవెంట్లు సక్సెస్ కావడం గమనార్హం.ప్రస్తుతం సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ గా ఉన్నారు.

సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.జబర్దస్త్ షోకు నాగబాబు జడ్జిగా ఉన్న సమయంలో సుధీర్ టీమ్ చేసే స్కిట్లను మెచ్చుకునేవారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం సుధీర్ ఫ్యాన్స్ ను అవాక్కయ్యేలా చేస్తోంది.

Telugu Extrajabardasth, Jabardasth Show, Nagababu, Netizens, Sensational-Movie

ఒక నెటిజన్ నాగబాబు ” సుధీర్ తో మీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది” అని ప్రశ్నించగా శతకోటి సుధీరుల్లో ఏ సుధీర్ గురించి నువ్వు అడుగుతున్నావ్ అని నాగబాబు ప్రశ్నించారు.నాగబాబు కావాలనే సుధీర్ ఎవరో తెలియనట్టు సమాధానం ఇచ్చారు.నాగబాబు ఇచ్చిన సమాధానం వల్ల నాగబాబుకు, సుధీర్ కు మధ్య దూరం పెరిగిందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నాగబాబు జబర్దస్త్ షోకు దూరమైన తరువాత నాగబాబు సుధీర్ కలిసి ఎక్కడా కనిపించలేదు.

నాగబాబు జబర్దస్త్ షోను వీడిన తరువాత కొంతమంది టీమ్ లీడర్లు ఆ షోకు దూరమైనా సుడిగాలి సుధీర్ మాత్రం ఆ షోకు దూరం కాలేదు.ఆ కారణం వల్లే నాగబాబు సుధీర్ పరువు తీసేలా కామెంట్ చేసి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube