నాగబాబుకి ఆర్జీవీ మద్దతు... త్వరలో గాడ్సేపై సినిమా అని ప్రకటన

గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పెద్ద వార్ నడుస్తుంది.కొంత మంది నాగబాబు వాఖ్యలని సమర్దిసూ ఉంటే మరోకొంత మంది ఆయన వాఖ్యలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 Rgv Supports Nagababu Comments On Godse, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

అయితే వ్యతిరేకించే వాళ్ళలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే ఉండటం విశేషం.ఇదిలా ఉంటే ఈ వాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ నాగబాబుకి మద్దతుగా నిలబడ్డాడు.

గాంధీని నాథూరాం గాడ్సే చంపాడని మాత్రమే చెబుతున్నారని అయితే, ఎందుకు చంపాడనే విషయాన్ని మాత్రం ఎవరూ ఎందుకు చెప్పడం లేదని వర్మ ప్రశ్నించారు.గాంధీని ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే… గాడ్సే అందరి దృష్టిలో విలన్ గా మారిపోయాడని అన్నారు.

వాస్తవానికి గాంధీకి గాడ్సే ఫాలోవర్ అని చెప్పారు.దేశానికి స్వాతంత్ర్యం రావడం, భారత్-పాక్ విడిపోవడం రెండూ గాడ్సే కోరుకున్నాడని అవి రెండూ జరిగాయని అయినా ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదని చెప్పారు.

అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గాంధీని ఎందుకు చంపాడనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి ఉండొచ్చని వర్మ అన్నారు.ఏదేమైనా గాడ్సేకి ఉన్న దేశభక్తి విషయంలో నాగబాబుతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పారు.

గాడ్సే కథతో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని తెలిపారు.మరి నిజంగా వివాదాస్పద అంశాలని కథలుగా మార్చుకొని సినిమాలు తీసే ఆర్జీవీ గాడ్సే కథాంశంతో సినిమా తీసుకుంటే మాత్రం కచ్చితంగా అది దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube