బాలయ్యను ఎందుకు టార్గెట్‌ చేశాడో చెప్పిన నాగబాబు.. ఆరు వీడియోలను విడుదల చేసిన నాగబాబు     2019-01-07   13:04:25  IST  Ramesh Palla

బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. నాగబాబు గత కొన్నాళ్లుగా బాలకృష్ణను డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా విమర్శిస్తూ వస్తున్నాడు. ఎన్టీఆర్‌ సినిమా గురించి, ఎన్టీఆర్‌ సినిమా తీసిన విధానం గురించి, బాలకృష్ణ పద్దతి గురించి రకరకాలుగా విమర్శలు చేసిన నాగబాబు తాజాగా డైరెక్ట్‌ ఎటాక్‌ చేశాడు. బాలకృష్ణపై తాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనే విషయంపై నాగబాబు సుదీర్ఘంగా క్లారిటీ ఇచ్చాడు.

గతంలో పలు ఇంటర్వ్యూలో, పలు సందర్బాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లను అవమానపర్చుతూ మాట్లాడటంతో పాటు, ఇండస్ట్రీలో మేమే గొప్ప, మేమే తోపులం, మేమే సూపర్‌ స్టార్స్‌ అంటూ చెప్పుకొచ్చాడు. మా ముందు అంతా జీరోలే అన్నట్లుగా మాట్లాడాడు. గతంలో పవన్‌ కళ్యాణ్‌ ఎవరో నాకు తెలియదు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యు చేశాడు.

Nagababu Reveals That Why He Targeted Balakrishna-Nagababu And Balakrishna Controversy Trolls On Viral About Targets

Nagababu Reveals That Why He Targeted Balakrishna

ఇక అమితాబచ్చన్‌ ఏం పీకాడు, చిరంజీవి కూడా ఏం చేయలేక పోయాడు, అది మాకే సొంతం, మా రక్తంలోనే అది ఉంది అంటూ బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలను ఒక్కోదాన్ని తీసుకుని నాగబాబు సవివరంగా కామెంట్‌ చేశాడు.మేమే సూపర్‌ స్టార్స్‌ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ… ఇండస్ట్రీలో మీరు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మీకు మీరు మేమే సూపర్‌ స్టార్స్‌ అనుకుంటే ఎలా అన్నాడు.

Nagababu Reveals That Why He Targeted Balakrishna-Nagababu And Balakrishna Controversy Trolls On Viral About Targets

ఇక ఒక ఇంటర్వ్యూలో అమితాబ్‌ ఏమీ పీకాడు, చిరంజీవి ఏం చేశాడని బాలయ్య అనడంపై కూడా నాగబాబు సీరియస్‌ అయ్యాడు. అమితాబ్‌ ఒక సూపర్‌ స్టార్‌ ఆయన్ను పట్టుకుని ఏం పీకాడు అన్నావు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం ఏంటీ అంటూ నాగబాబు ప్రశ్నించాడు. బాలకృష్ణ గతంలో చేసిన ఆరు కామెంట్స్‌ పై ఆరు వీడియోలను నాగబాబు వదులుతున్నాడు. ఇప్పటికే మూడు కామెంట్స్‌కు వీడియోలను చేశాడు. ఇంకా బాయ్యపై వీడియోలను నాగబాబు విడుదల చేయబోతున్నాడు.