నిహారిక చైతన్యల లవ్ స్టోరీ చెప్పేసిన నాగబాబు..!

మెగాడాటర్ నిహారిక చైతన్యల వివాహం గురించి అధికారిక ప్రకటన వెలువడిన రోజు నుంచి వాళ్లిద్దరూ జంటగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.నిహారిక చైతన్యల పెళ్లి ప్రేమపెళ్లి అని కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లి అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

 The Unknown Love Story Of Niharika Konidela And Chaitanya-TeluguStop.com

అయితే స్వయంగా నాగబాబు నిహారిక చైతన్యల లవ్ స్టోరీ చెప్పడంతో నిహారిక చైతన్యను ప్రేమించి పెళ్లికి ఒప్పించిందని తెలుస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబు తాను జూబ్లీహిల్స్ లోని అపోలో జిమ్ లో వర్కవుట్లు చేసేవాడినని.

నిహారిక – చైతన్య 2015 నుంచే తనను ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు చేశారని అన్నారు.తాను వర్కవుట్లు చేసే జిమ్ లోనే చైతన్య కూడా జాయిన్ అయ్యాడని.

రోజూ తనను చైతన్య విష్ చేసేవాడని తెలిపారు.అయితే చాలా సంవత్సరాల ప్రేమ అనంతరం గతేడాది నిహారిక నాగబాబుకు చైతన్యను ప్రేమిస్తున్న సంగతి తెలియజేసింది.

Telugu Love, Nagababu, Love Story-Movie

నిహారిక చైతన్య గురించి చెప్పిన తరువాత నాగబాబు చైతన్య గురించి, అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుని చివరకు పెళ్లికి అంగీకరించారు.నాగబాబు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని నెలల తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి గురించి ప్రకటన వెలువడింది.కూతురు ప్రేమను అర్థం చేసుకున్న నాగబాబు పెద్దమనస్సుతో కూతురు ప్రేమను అంగీకరించి నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించారు.

Telugu Love, Nagababu, Love Story-Movie

నాగబాబు బయటపెట్టడంతో నిహారిక చైతన్యల పెళ్లి ప్రేమ పెళ్లి అని తేలిపోయింది.ఘనంగా జరిగిన నిహారిక చైతన్యల వివాహానికి పెళ్లి ఖర్చు కంటే వచ్చిన కానుకల విలువే ఎక్కువని తెలుస్తోంది.దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన నిహారిక చైతన్యలకు కానుకల రూపంలో వచ్చాయని సమాచారం.

పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానించినా, కరోనా నిబంధనలు ఉన్నా మూడు రోజుల పాటు నిహారిక చైతన్యల పెళ్లి గురించే మాట్లాడుకునేంత గొప్పగా పెళ్లి జరగడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube