మళ్ళీ లాక్ డౌన్ కరెక్ట్ కాదు అంటున్న మెగా బ్రదర్

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.ఓ విధంగా చెప్పాలంటే కరోనాని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వంకి చాలా భారం అవుతుంది.

 Nagababu Requests Governments, Do Not Impose Another Lockdown, Hyderabad, Corona-TeluguStop.com

కరోనాపై ప్రజలని ఎంత అవగాహన కల్పించి జాగ్రత్తగా ఉండాలని చెప్పిన వారి నిర్లక్ష్యం కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ విపరీతంగా తన ప్రభావం చూపిస్తుంది.

ముంబై తర్వాత ఆ స్థాయిలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నగరాలలో జాబితాలో హైదరాబాద్ ఉంది.ఈ నేపధ్యంలో గ్రేటర్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని, మళ్లీ లాక్ డౌన్ విధిస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

అసలు లాక్ డౌన్ అనేది ఎందుకు విధిస్తారు? అన్ని రకాల శక్తులు, వనరులను సమీకరించుకోవడానికే కదా ప్రజలందరూ 90 రోజుల పాటు తమ జీవితాలను వదిలేశారు.వలస కార్మికుల వెతలు చెప్పనలవి కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించి, ప్రజల జీవితాలను స్తంభింపచేస్తే అది చారిత్రక తప్పిదం అవుతుంది.ఏ రాష్ట్రం అయినా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సరిదిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుంది.

చాలా దేశాలు లాక్ డౌన్ లేకుండానే కరోనాను ఎదుర్కొంటున్నాయి.మనది పెద్ద దేశం కావడంతో ఇప్పటివరకు లాక్ డౌన్ నిర్ణయం సమంజసమే కావొచ్చు కానీ, మళ్లీ లాక్ డౌన్ అంటే ఆ నిర్ణయం సరికాదు.

కరోనా బాధితులని గుర్తించడం, వారికి తగిన వైద్యం అందించడంతో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాని కంట్రోల్ చేయొచ్చు.అయితే లాక్ డౌన్ మళ్ళీ విధిస్తే మాత్రం కచ్చితంగా అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది అని నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube