2024 లో బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: నాగబాబు  

Janasena And Bjp Will Form Government On 2024 In Ap - Telugu Ap Bjp, Ap Janasena, Bjp-janasena, Nagababu, Pawan Kalyan

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించారు.ఈ పర్యటనలో ఏపీ సీఎం జగన్ గురించి విమర్శలు చేసిన నాగబాబు 2024లో బీజేపీ జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Janasena And Bjp Will Form Government On 2024 In Ap

నాగబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థమయ్యే పరిస్థితి లేదని విమర్శలు చేశారు.

సీఎం జగన్ ప్రభుత్వ పరంగా ఏవైనా పనులు చేయాలనుకుంటే ఆ పనుల గురించి అనుభవజ్ఞులతో చర్చించాలని అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ కు సూచించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో జగన్ తో పోలిస్తే కొంత మేలని చంద్రబాబును నాగబాబు ప్రశంసించారు.

బీజేపీ జనసేన పార్టీల కలయిక వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.బీజేపీ జనసేన పార్టీలు కలిసి 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుందని చెప్పారు.

జగన్ రాష్ట్రంలో ఎప్పుడు ఏది రద్దు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లపై ప్రయాణం చేయలేమని హెలికాఫ్టర్లు కొనుక్కొని ప్రయాణించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా వార్తలు

Janasena And Bjp Will Form Government On 2024 In Ap-ap Janasena,bjp-janasena,nagababu,pawan Kalyan Related....