నాగబాబు కొత్త లుక్ సీక్రెట్ రివీల్... ఆపరేషన్ ఆక్టోపస్ సినిమా పోస్టర్ రిలీజ్

మెగా బ్రదర్ నాగబాబు ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.మరో వైపు సినిమాలలో కూడా తండ్రి పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ రోల్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

 Nagababu Operation Octopus Movie First Look Released-TeluguStop.com

అయితే నాగబాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేశాడు.వాటిలో ప్రేక్షకులని ఆకట్టుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే నాగబాబు నటుడుగా కంటే నిర్మాతగా, మెగాస్టార్ తమ్ముడుగానే ఎక్కువగా ప్రచారంలో ఉండటానికి ఇష్టపడతారు.ఆ విషయాన్ని చాలా సందర్భాలలో అతను సినిమా ఫంక్షన్స్ లో కూడా చెప్పారు.

 Nagababu Operation Octopus Movie First Look Released-నాగబాబు కొత్త లుక్ సీక్రెట్ రివీల్… ఆపరేషన్ ఆక్టోపస్ సినిమా పోస్టర్ రిలీజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ చానల్ కూడా స్టార్ట్ చేసి తన అభిప్రాయాలని షేర్ చేసుకుంటూ వచ్చారు.అలాగే ఈ మధ్య ఒక స్టాండ్ అప్ కామెడీ షోని తన యుట్యూబ్ చానల్ ద్వారా రన్ చేశారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా నాగబాబు డిఫరెంట్ లుక్స్ తో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.సాల్ట్ పెప్పర్ లుక్స్ లో విలనీ షేడ్స్ లో అతని లుక్స్ ఉండటంతో హిందీలో చత్రపతి రీమేక్ కోసం నాగబాబు ఈ లుక్ లోకి మేకోవర్ చేయించుకున్నారని టాక్ వచ్చింది.

అయితే తాజాగా అసలు విషయాన్ని రివీల్ చేశారు.తెలుగులో వైల్డ్ డాగ్ తరహాలోనే ఆర్మీ కాన్సెప్ట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది.ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.అందులో మిషన్ గన్ పట్టుకొని కమాండో గెటప్ లో నాగబాబు కనిపించి అందరికి షాక్ ఇచ్చారు.

ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఫోటోలకి సంబంధించి సీక్రెట్ ఇదా అని ఆశ్చర్యపోతున్నారు.హాలీవుడ్ రేంజ్ లో నాగబాబు లుక్ ఉండటం విశేషం.

ఈ సినిమాతో శ్యామ్యూల్ సుజిత్ పాల్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.టైటిల్, ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు.

మరి ఈ సినిమాతో దర్శకుడు నాగబాబుని ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయడం మాత్రం పక్కా అని తెలుస్తుంది.

#NagababuLatest #Nagababu #Megastar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు