నాథూరాం గాడ్సే వివాదం,మెగా బ్రదర్ పై ఫిర్యాదు  

Nagababu Mahathmagandhi Nathuram Gadse - Telugu Koturi Manavatha Rai, Mahathmagandhi, Nagababu, Nathuram Gadse, Ramgopal Varma, Twitter, Vijayashanthi

ఒక్కొక్కసారి సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తూ ఉంటాయి.ఎదో జనరల్ గా చేసే వ్యాఖ్యలను కూడా పట్టుకొని వాటిపై పెద్ద డెబిట్ నడిపించేస్తారు.

 Nagababu Mahathmagandhi Nathuram Gadse

సరిగ్గా మెగా బ్రదర్ నాగబాబు విషయంలో కూడా అదే జరిగింది.నాథూరాం గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు పెను దుమారం సృష్టించింది.

ఒకరి తరువాత మరొకరు నాగబాబు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.రాజకీయ నేతల తో పాటు పలువురు గాడ్సే నిజమైన దేశభక్తుడు అని నాగబాబు చేసిన ట్వీట్ పై పెద్ద చర్చే నడుస్తుంది.

నాథూరాం గాడ్సే వివాదం,మెగా బ్రదర్ పై ఫిర్యాదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు ట్విట్టర్ లో ఫొటో షేర్ చేస్తూ.‘గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు.

కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది.పాపం నాథూరాం గాడ్సే.మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇప్పటికే నాగబాబు ట్వీట్ పై నటి,రాజకీయ నేత విజయ శాంతి మండిపడ్డారు.మరోపక్క నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందించారు.

మెగా బ్రదర్ చెప్పింది నిజమే అని ఆయనకు నా సపోర్ట్ ఉంటుంది అని,త్వరలో గాడ్సే పై సినిమా కూడా చేస్తాను అను ప్రకటించారు.మరోపక్క నాగబాబు జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

నాగబాబు వ్యాఖ్యలు మహాత్మా గాంధీ ని కించపరిచేలా ఉన్నాయి అని, ఆయనకు మతి భ్రమించింది అంటూ వ్యాఖ్యలు చేశారు.ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు, ఆయనను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలి.మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే ట్విటర్‌లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని కొనియాడారు అంటూ వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ అంశంపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా నాగబాబు క్షమాపణలు చెప్పారు.

అయినప్పటికీ ఈ విషయంపై రాద్ధాంతం మాత్రం కొనసాగుతూనే ఉంది.మరి ఇది ఎక్కడివరకు దారి తీస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు