నాగబాబు మిస్ చేసుకున్న 'గ్యాంగ్ లీడర్‌' కు 30 ఏళ్లు

మెగా స్టార్‌ చిరంజీవి కెరీర్‌ లో నిలిచి పోయే చిత్రం గ్యాంగ్ లీడర్‌.విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల అయ్యి నేటికి 30 ఏళ్లు పూర్తి అయ్యింది.

 Nagababu Leave Gang Leader For Mega Star Chiranjeevi-TeluguStop.com

ఈ సినిమా తో చిరంజీవి మాస్ ఆడియన్స్ కు మరింతగా చేరువ అయ్యాడు.విజయశాంతి హీరోయిన్‌ గా రూపొందిన గ్యాంగ్‌ లీడర్‌ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది.

చిరంజీవి ఆ సినిమా లో అద్బుత నటన కనబర్చడంతో పాటు సినిమాలోని పాటలు అన్ని కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి.దాంతో సినిమా మాస్‌ మసాలా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 Nagababu Leave Gang Leader For Mega Star Chiranjeevi-నాగబాబు మిస్ చేసుకున్న గ్యాంగ్ లీడర్‌’ కు 30 ఏళ్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ్యాంగ్ లీడర్ సినిమా కథ చిరంజీవి కంటే ముందుగా నాగబాబు వద్దకు వెళ్లిందట.నటుడిగా అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న మెగా బ్రదర్‌ నాగబాబు కోసం ఈ కథను విజయ బాపినీడు తయారు చేశాడు.

పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాను నాగబాబుతో తీయాలని విజయ బాపినీడుకు సలహా ఇవ్వడం జరిగిందట.

విజయ బాపినీడు మరియు పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన ఈ కథను నాగబాబు విన్నాడు.

ఆయన నచ్చి హీరోగా నటించేందుకు ఓకే చెప్పాడు.కథ రీత్యా సినిమా కాస్త ఎక్కువ బడ్జెట్‌ తో రూపొందించాల్సి ఉంటుంది.

నాగబాబు వంటి కొత్త హీరోతో అంత బడ్జెట్‌ పెట్టడం మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ పలువురు నిర్మాతలు చేతులు ఎత్తేశారు.దాంతో నాగబాబు స్వయంగా ఈ కథను తన అన్న చిరంజీవి వద్దకు తీసుకు వెళ్లాలంటూ దర్శకుడు విజయ బాపినీడుకు సూచించాడు.

చిరంజీవి ఆ కథకు ఓకే చెప్పడంతో పాటు అరె ఓ సాంబ టైటిల్ ను గ్యాంగ్ లీడర్ గా మార్చి కథను కూడా కాస్త మార్చి తెరకెక్కించారు.సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే.

నాగబాబు ఒక వేళ గ్యాంగ్ లీడర్‌ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ మరో లా ఉండేదేమో.మొత్తానికి తమ్ముడు చేయాల్సిన గ్యాంగ్ లీడర్‌ అన్న చిరంజీవి చేసి విడుదల అయ్యి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

#Chiranjeevi #Gang Leader #30yearsFor #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు