నాగబాబును జనసేన నుండి సస్పెండ్‌ చేస్తారా?  

Nagababu Janasena Party Suspension - Telugu Gandhi, Godse, Janasena Party, Nagababu, Pawan Kalyan, Social Media, Suspend

మొన్న గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ ట్వీట్‌ చేసిన నాగబాబు ఆ తర్వాత కూడా వివాదాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.గాంధీని చంపినందుకు గాడ్సే నేరస్థుడే అయినా కూడా ఆయన గొప్ప దేశ భక్తుడు అని మాత్రం తాను చెప్పదల్చుకున్నాను అంటూ నాగబాబు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు.

 Nagababu Janasena Party Suspension

ఈ విషయంలో ఫ్యామిలీకి కాని, జనసేన పార్టీకి కాని సంబంధం లేదు అంటూ పేర్కొన్నాడు.అయినా కూడా కొందరు ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు.

నాగబాబు దేశ ద్రోహిలా మాట్లాడుతున్నాడు.ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు జనసేన పార్టీ ఉదేశ్యం అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా జనసేన పార్టీ తరపున అధికారికంగా ప్రకటన చేశాడు.ఈ విషయంలో పార్టీకి సంబంధం ఏమీ లేదని, అసలు ఎవరి ఉద్దేశ్యాలు వారివి అంటూ తెలియజేశాడు.

నాగబాబును జనసేన నుండి సస్పెండ్‌ చేస్తారా-Movie-Telugu Tollywood Photo Image

వారి వ్యక్తిగత ఉద్దేశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వాటిని పార్టీని ఆపాదించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.ఈ విషయంలో నాగబాబును వెనకేసుకు వచ్చేలా పవన్‌ మాట్లాడుతున్నాడు అని, వెంటనే నాగబాబును జనసేన పార్టీ నుండి తప్పించాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.మరి పవన్‌ ఆ పని చేస్తాడా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagababu Janasena Party Suspension Related Telugu News,Photos/Pics,Images..

footer-test