అగ్రిమెంట్లతో బెదిరిస్తారు.. ఆ సంస్థపై నాగబాబు ఫైర్..?  

nagababu comments about agriments in bomma adirindi show Nagababu, Jabardasth, Bomma Adirindhi, Mukku Avinash, Chamak Chandra, Agriments Mallemala Production - Telugu Agriments Mallemala Production, Bomma Adirindhi, Chamak Chandra, Jabardasth, Mukku Avinash, Nagababu, Nagababu Comments About Agriments In Bomma Adirindi Show

మెగాస్టార్ తమ్ముడు, నటుడు, జనసేన నేత నాగబాబు గత కొన్ని నెలల నుంచి తనకు నచ్చని విషయాల గురించి, వ్యక్తుల గురించి ఘాటుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.సుదీర్ఘ కాలం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు వేర్వేరు కారణాల వల్ల ఆ షోను వీడి ప్రస్తుతం బొమ్మ అదిరింది షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

TeluguStop.com - Nagababu Jabardasth Bomma Adirindhi

జబర్దస్త్ షోను వీడిన తరువాత మల్లెమాల సంస్థపై కొన్ని ఆరోపణలు చేసిన నాగబాబు మళ్లీ ఆ షోపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

కొన్ని వారాల క్రితం ముక్కు అవినాష్ జబర్దస్త్ షోను వీడి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.

TeluguStop.com - అగ్రిమెంట్లతో బెదిరిస్తారు.. ఆ సంస్థపై నాగబాబు ఫైర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ సమయంలో అగ్రిమెంట్ల ప్రకారం అవినాష్ జబర్దస్త్ నిర్వాహకులకు పది లక్షల రూపాయలు చెలించాడని వార్తలు వైరల్ అయ్యాయి.మల్లెమాల సంస్థ ముందుగానే కమెడియన్లతో అగ్రిమెంట్లు చేయించుకుంటుందని.

వాళ్లంతకు వాళ్లుగా కమెడియన్లు వెళ్లిపోతే అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించాలని ప్రచారం జరిగింది.

తాజాగా ప్రసారమైన బొమ్మ అదిరింది షోలో చమ్మక్ చంద్ర పనిమనిషి స్కిట్ వేశాడు.

ఆ స్కిట్ లో భాగంగా చమ్మక్ చంద్ర ఇంటి యజమానితో తను పనిలోకి చేరిన తరువాత ఏదైనా కారణం వల్ల పని మానేస్తే పది లక్షలు చెల్లిస్తానని.ఇంటి యజమాని ఏదైనా కారణం వల్ల మానేస్తే పది లక్షలు చెల్లించాలని కాంట్రాక్ట్ కుదుర్చుకుందామని చెబుతాడు.

వెంటనే నాగబాబు రియాక్ట్ అవుతూ నీ కాంట్రాక్ట్ ఎంతో న్యాయంగా ఉందని.కొందరి కాంట్రాక్టులు ధారుణంగా ఉంటాయని అన్నారు.

కొందరు మనం వెళ్లినా పది లక్షలు కట్టించుకుంటారని.వాళ్లు పీకేసినా పది లక్షలు కట్టాలని పరోక్షంగా సెటైర్లు వేశారు.మల్లెమాల పేరు నాగబాబు పైకి చెప్పకపోయినా ఆ సంస్థనే ఉద్దేశించి అన్నారని అర్థమవుతుంది.నాగబాబు పరోక్షంగా అగ్రిమెంట్లతో బెదిరిస్తారంటూ ఆ సంస్థపై ఫైర్ అయ్యారు.

అయితే గతంలో కొందరు కమెడియన్లు అకస్మాత్తుగా షో నుంచి తప్పుకోవడం వల్లే ఇలాంటి అగ్రిమెంట్లు అమలులోకి వచ్చాయని మరి కొందరు చెబుతున్నారు.

#Nagababu #Mukku Avinash #Chamak Chandra #Jabardasth #Bomma Adirindhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagababu Jabardasth Bomma Adirindhi Related Telugu News,Photos/Pics,Images..