మెగా బ్రదర్ నాగబాబు ఆరెంజ్ చిత్రంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
నాగబాబును ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ కూడా కొంత సాయం అందించాడని వార్తలు వచ్చాయి.నాగబాబును మళ్లీ నిలబెట్టేందుకు ఆయన నిర్మాణంలో ఒక సినిమా చేయాలని పవన్ భావించాడు.
అలా గబ్బర్‌సింగ్‌ను మొదలు పెట్టారు.హరీష్ శంకర్ దర్శకుడుగా ఎంపిక అయిన తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయంకు నాగబాబు నా వల్ల కాదన్నాడు.
అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తాను మళ్లీ ఈ సినిమా ఫ్లాప్ అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే ఉద్దేశ్యంతో సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు క్యాన్సిల్ చేసుకున్నాడు.ఆ సినిమా నిర్మాణ బాధ్యతలను మద్యలో వచ్చిన బండ్ల గణేష్‌కు అప్పగించాడు.
ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టకుండానే సినిమాను రూపొందించారు.
రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి.
ఒకవేళ గబ్బర్‌సింగ్ నాగబాబు కనుక నిర్మించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.ఆయన ఆరెంజ్ అప్పులు అన్ని కూడా కొట్టుకు పోయి డబుల్ ప్రాఫిట్ వచ్చేది.రికార్డుల విషయం పక్కన పెడితే అప్పట్లోనే ఇండస్ట్రీలో టాప్ షేర్‌ను ఈ సినిమా దక్కించుకుంది.
పవన్ కళ్యాణ్ కెరీర్లో నిలిచినట్లుగానే నాగబాబు కెరీర్లో కూడా నిలిచిపోయి ఆ తర్వాత వరుసగా నాగబాబు సినిమాలు నిర్మించి ఉండేవాడు.కాని పాపం నాగబాబు దురదృష్టంతో గబ్బర్‌సింగ్‌ను వదిలేశాడు.