బాలయ్య నోరు అదుపులో పెట్టుకో అంటోన్న నాగబాబు  

Nagababu Fires On Balakrishna Comments - Telugu Balakrishna, Chiranjeevi, Nagababu, Tollywood News

టాలీవుడ్‌లో స్టార్స్ మధ్య విబేధాలు ఉన్నాయనే విషయాన్ని మరోసారి బట్టబయలు చేశారు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

 Nagababu Fires On Balakrishna Comments

టాలీవుడ్‌లో పెద్దరికం చూపెట్టేందుకు, తమ భూములను కాపాడుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇండస్ట్రీలో జరుగుతున్న సమావేశాల గురించి సినిమా వాళ్లకు ఎందుకు సూచించడం లేదని ఆయన పలువురిపై ఇన్‌డైరెక్ట్‌గా మండిపడ్డారు.

అయితే ఇటీవల కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ నుండి సడలింపులు లభించడంతో, చిత్ర పరిశ్రమలో షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు తమకు అనుమతినివ్వాలంటూ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు చిరంజీవి అధ్యక్షతన సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పలు దఫాల చర్చలు జరిపారు.ఈ చర్చల గురించి తనకు ఎవరూ చెప్పలేదని, విబేధాల కారణంగా ఇదంతా జరుగుతుందని బాలయ్య అన్నారు.

బాలయ్య నోరు అదుపులో పెట్టుకో అంటోన్న నాగబాబు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే బాలయ్య చేసిన కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు.

ఇండస్ట్రీలో ఎవరూ తమ సొంత లాభం చూసుకోవడం లేదని, సినీ కార్మికులకు మేలు కలగాలనే ఉద్దే్శ్యంతోనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారని ఆయన అన్నారు.

బాలయ్య తనను పిలవలేదని వాదించడంలో అర్ధం ఉందని, కానీ భూములు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనడం ఖండిస్తున్నామని నాగబాబు అన్నారు.అంతేగాక ఏదో బూతు పదం వాడారని, వెంటనే తన వ్యాఖ్యలను బాలయ్య వెనక్కి తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు