టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక మంచి నిర్మాతగా మరియు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే తాజాగా నాగబాబు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా తన కూతురు నిహారిక పెళ్లి విషయం గురించి స్పందించాడు.
అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ నిహారిక పెళ్లి గురించి ప్రేక్షకులకి తెలియజేయాలని కోరింది.
దీంతో నాగబాబు నిహారిక పెళ్లి అంటే పబ్లిక్ పండుగ కాదని అది మా ఇంట్లో జరిగే ఫంక్షన్ అని సమాధానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా యాంకర్ ఖంగు తింది.అంతేగాక తొందర్లోనే నిహారిక పెళ్లి గురించి పూర్తి వివరాలను తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు నాగబాబు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ ప్రభావం కారణంగా పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా చేయాలనే ఆలోచనలో నాగబాబు కుటుంభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు పలు బాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ మరోపక్క ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.