అంతా నా ఇష్టం...మెగా బ్రదర్స్ కి తీవ్ర నష్టం..!!!  

  • ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు చేస్తామని. ఏ పార్టీతో కూడా మా పొత్తు ఉండదని, మా సత్తా చాటి క్రియాశీలకంగా చక్రం తిప్పుతామని ఎంతో కాన్ఫిడెంట్ గా గతంలో పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాదు ఎన్నో సందర్భాలలో ఇదే విషయాన్ని తెలిపారు కూడా. అయితే తన బలం కేవలం పరిమితమైనదే అయినా సరే , గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం సరిగా లేకపోయినా సరే పవన్ అంత ధీమాగా చెప్పాడంటే కారణం పవన్ కి ఉన్న బలమైన నమ్మకం. ఇదిలాఉంటే

  • Nagababu Damages Janasena Party With His Comments In Social Media-Nagababu Nagababu Media On Ys Jagan Trolls Naga Babu

    Nagababu Damages Janasena Party With His Comments In Social Media

  • ఒక పక్క ఏపీ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పై సింపతీ చూపిస్తూ వచ్చారు. చిన్న పార్టీ అయినా సరే ఎంతో ధైర్యంగా ఉన్న పవన్ పై ప్రసంసల జల్లులు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. కాని ఇప్పుడే అసలు గొడవ మొదలు అయ్యింది. నిన్నటి వరకూ పవన్ పైపు మొగ్గు చూపిన ప్రజలు ఇప్పుడు జనసేనపై విసుగు చెందారట, జనసేన పేరు చెప్తేనే కోపంతో రగిలిపోతున్నారట…దీనంతటికి కారణం మెగా బ్రదర్ నాగాబాబే అంటున్నారు.

  • ఇంతకీ నాగబాబు పై ప్రజలు అందరూ ఇలా రివర్స్ అవ్వడానికి కారణం ఏమిటంటే. గత కొంతకాలంగా నాగబాబు సోషల్ మీడియా యూట్యుబ్ లో హాల్ చల్ చేస్తూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే. గతంలో నాగబాబు కత్తిమహేష్ విషయంలో చేసిన విమర్శలు ప్రజలు స్వీకరించారు, మళ్ళీ శ్రీ రెడ్డి తన ఫ్యామిలీ విషయంలో కలిపించుకున్న సమయంలో కూడా విమర్శలు చేస్తే సమాజం పెద్దగ పట్టించుకోలేదు. బాలయ్య ని ఎకేసిన సమయంలో సైతం ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. అలాగే

  • Nagababu Damages Janasena Party With His Comments In Social Media-Nagababu Nagababu Media On Ys Jagan Trolls Naga Babu
  • చంద్రబాబు ,లోకేష్ లపై వ్యాఖ్యలు చేసిన సమయంలో సైతం అందరూ ఇదంతా కామన్ అనుకున్నారు కాని రోజు రోజుకి ఆయన తీరు అందరికి చిరాకు కలిగిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన సొంత యూట్యూబ్ ఛానెల్ ని అడ్డం పెట్టుకుని నాగబాబు చేస్తున్న హంగామా మాములుగా లేదని అంటున్నారు. జగన్ పై నాగాబాబు కామెంట్స్ చేసిన నాటినుంచీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కూడా గట్టుకుంటూ వచ్చారు. పవన్ కి మద్దతుగా పొలిటికల్ సెటైర్స్ కోసం ఈ రకమైన ప్రయత్నాలు నాగబాబు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

  • తాజాగా నాగబాబు గాన గంధర్వుడు ఎస్పీ .బాబు విషయంలో సైతం కామెంట్స్ చేయడం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. మహిళల వస్త్రధారణ విషయంలో బాలు ఆవేదనపై నాగాబాబు అతిగా స్పందిచడం తో సీన్ రివర్స్ అయ్యింది. నాగబాబు పై ఎన్నడూ లేనంతగా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు. అసలు నీకెందుకు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు కూడా ఇదిలాఉంటే. ఈ పరిణామాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతాయని. ఎన్నికల సమయంలో నాగబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ వేస్తె అది జనసేనపై తీవ్ర ప్రభావం ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. నాగబాబు ని కంట్రోల్ లో పెట్టుకోవడం మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు.