ఆ ఔషధంతో కరోనాను జయించిన నాగబాబు?  

Nagababu corona recovery message to people, Nagababu, Youtube Channel, Corona Tests, Plasma Donation,remdesivir medicine - Telugu Corona Tests, Mega Brother, Nagababu, Nagababu Corona Negative, Nagababu Corona Recovery Message To People, Niharika Father, Plasma Donation, Remdesivir Medicine, Varun Tej Father, Youtube Channel

మెగా బ్రదర్, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.మెగా బ్రదర్ కు కరోనా సోకడంతో ఆయన అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు.

TeluguStop.com - Nagababu Corona Recovery Message Remdesivir Medicine

తాజాగా సోషల్ మీడియా ద్వారా నాగబాబు తాను వైరస్ ను జయించినట్టు తెలిపారు.అనంతరం తన అనుభవాలను, వాడిన మందులను, కరోనా సోకిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నాగబాబు వెల్లడించారు.
14 రోజుల హోం ఐసోలేషన్ లో ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్ని నాగబాబు చెప్పారు.నిహారిక నిశ్చితార్థానికి ముందు తనతో సహా కుటుంబ సభ్యులంతా కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని.

నిశ్చితార్థం అనంతరం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా వైరస్ నిర్ధారణ అయిందని తెలిపారు.కరోనా పాజిటివ్ అని తెలియగానే తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు.

TeluguStop.com - ఆ ఔషధంతో కరోనాను జయించిన నాగబాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటివరకు తాను ఐదుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఈ సందర్భంగా నాగబాబు వెల్లడించారు.న్యూమోనియా ఉండటంతో ఆస్పత్రిలో చేరగా ఐదు రోజుల పాటు రెమిడెసివిర్ ఔషధం తీసుకున్నానని.

ఆ ఔషధం కరోనాను జయించడంలో సహాయపడిందని తెలిపారు.తనకు జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి కరోనా లక్షణాలు మినహా ఇతర లక్షణాలేవీ కనిపించలేదని వెల్లడించారు.

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉందని.వైరస్ కు ఎవరూ అతీతులు కారని నాగబాబు అన్నారు.ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని.శరీరంలో వైరస్ లోడ్ ను బట్టి చికిత్స జరుగుతుందని.

మనిషి మనిషికి చికిత్స ఇచ్చే విధానంలో మార్పులు ఉంటాయని వెల్లడించారు.త్వరలో ప్లాస్మా దానం చేస్తానని నాగబాబు తెలిపారు.14 రోజుల తర్వాత శరీరంలో వైరస్ ఉన్నా మనకు ఎలాంటి హాని కలగదని పేర్కొన్నారు.

#Plasma Donation #Mega Brother #Youtube Channel #NagababuCorona #NagababuCorona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagababu Corona Recovery Message Remdesivir Medicine Related Telugu News,Photos/Pics,Images..