'ఆరెంజ్' అప్పులు తీర్చడానికి నాగబాబు అంత కష్టపడ్డాడా..?

మెగాబ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు గురించి కీలక సూచనలు చేస్తున్నారు.ఎలా సంపాదిస్తే డబ్బు సొంతమవుతుందో, ఎలాంటి లక్షణాలుంటే డబ్బు దూరమవుంతో వీడియోల ద్వారా నాగబాబు వివరిస్తున్నారు.

 Nagababu Comments On Financial Planning In Real Life, Nagababu, Financial Planni-TeluguStop.com

తాజాగా ఒక వీడియో ద్వారా ఆరెంజ్ సినిమా మిగిల్చిన నష్టాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మాతగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమా 2010లో విడుదలైంది.

ఈ సినిమాకు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చింది.కథ, కథనంలోని లోపాలు, హీరోయిన్ పాత్ర ఈ సినిమాకు నెగిటివ్ గా మారాయి.కొంతమందికి ఇప్పటికీ ఈ సినిమా ఫేవరెట్ మూవీ అయినా మెజారిటీ ప్రజలకు నచ్చకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు ఆర్థికంగా భారీ మొత్తంలో నష్టపోయారు.

విదేశాల్లో షూటింగ్ కావడంతో ఈ సినిమాకు భారీగా ఖర్చైంది.

నాగబాబు మాట్లాడుతూ ఆరెంజ్ ఫలితం తరువాత మళ్లీ అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని భావించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టానని అన్నారు.2010లో నెలకు లక్షా యాభై వేలు అవసరం కాగా 50,000 రూపాయల లోటుతో జీవనం సాగించానని చెప్పారు.ప్రతి ఆరు నెలలకు లక్ష్యాన్ని మార్చుకుంటూ మూడు లక్షలు, ఆరు లక్షలు అలా చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించానని నాగబాబు చెప్పారు.

చిన్న చిన్న టార్గెట్లను నిర్ణయించుకుని ఆ టార్గెట్లను రీచ్ కావడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్పారు.అలా చేయడం వల్ల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.ఆరెంజ్ ఫ్లాప్ తరువాత సరైన ప్లానింగ్ తో నాగబాబు డబ్బు సంపాదించడంతో పాటు కొడుకు వరుణ్ తేజ్ ను హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు.వరుస విజయాలతో వరుణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube