నాగబాబు వల్ల మెగా బ్రదర్స్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌  

Nagababu Chiranjeevi Pawan Kalyan - Telugu Chiranjeevi, Gadse, Gandhi, Janasena, Mega Family, Nagababu, Social Meida, Tollywood

రెండు రోజుల క్రితం నాగబాబు ట్విట్టర్‌లో గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ ప్రశంసలు కురిపించాడు.గాంధీని చంపిన వ్యక్తిని దేశ భక్తుడు అంటావా బుద్ది లేదా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 Nagababu Chiranjeevi Pawan Kalyan

దాంతో ఆ ట్వీట్‌కు వివరణ ఇచ్చాడు.నేను అతడు చేసిన నేరంను సమర్థించలేదు.

గాంధీజీ అంటే నాకు చాలా గౌరవం.నేను కేవలం గాడ్సేకు సంబంధించిన దేశ భక్తిని మాత్రమే ట్వీట్‌ చేశాను అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నాగబాబు వల్ల మెగా బ్రదర్స్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ట్వీట్‌ వివాదం అయినా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరోసారి నాగబాబు స్పందించాడు.నా ట్వీట్‌ నా వ్యక్తిగతం.నా ఫ్యామిలీకి కాని, జనసేన పార్టీకి కాని ఎలాంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.నాగబాబు జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ఆయన చేసే ఎలాంటి వ్యాఖ్యలు అయినా కూడా పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే విషయంను ఆయన మర్చి పోయాడు.

మాట అనేసి ఇప్పుడు అది నా వ్యక్తిగతం అంటే మాత్రం ఎలా జనాలు ఊరుకుంటారు.ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఆయన కామెంట్స్‌తో మెగా బ్రదర్స్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యింది.ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయంలో చాలా చిరాకుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అన్న నాగబాబు వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అంటూ ఆయన జుట్టు పీక్కుంటున్నాడట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు