పేరు మార్చేసిన నాగబాబు.. అవాక్కయిన మెగా ఫ్యాన్స్

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.ఇటీవల టాలీవుడ్ సెలెబ్రిటీలు సీఎం కేసీఆర్, మంత్రి తలసానితో చర్చలు నిర్వహించినప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించారు.

 Nagababu Changes His Youtube Channel Name, Nagababu, Anthaa Naa Ishtam, Mana Cha-TeluguStop.com

ఈ వివాదం చాలా ముదురుతుండటంతో నాగబాబు దానిని లైట్ తీసుకుని ఫుల్ స్టాప్ పెట్టాడు.

ఇక ‘అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్‌ను పెట్టుకుని అన్ని విషయాల్లో తనదైన కామెంట్స్ చేస్తూ వస్తున్న నాగబాబు, తాజాగా తన యూట్యూబ్ ఛానల్ పేరును మార్చాడు.

‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ తన ఛానల్‌కు పేరును మార్చాడు.అయితే ఉన్నట్లుండి నాగబాబు తన యూట్యూబ్ ఛానల్‌ను ఎందుకు మార్చాడా అని అందరూ అనుకుంటున్నారు.

ఒకవేళ బాలయ్య వివాదంతో నాగబాబు వెనకడుగు వేశాడా అని అందరూ అనుకుంటున్నారు.అయితే నాగబాబు ఇలా పేరు మార్చడం తమకు తెలియదని అంటున్నారు.

అయితే తాను ఇకపై వివాదాస్పద అంశాలపై కామెంట్లు చేయబోనని నాగబాబు ఆలోచిస్తున్నాడట.అందుకే కేవలం సమాచారంతో పాటు వినోదాన్ని అందించేందుకు మాత్రమే తన ఛానల్‌ను వాడుతానని నాగబాబు అంటున్నారు.

మరి ఈ విషయంలో అసలు మర్మం ఏమైనా ఉందా అని సినీ వర్గాలతో పాటు పలువురు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.అసలు నాగబాబు తన ఛానల్‌కు పేరు ఎందుకు మార్చాడో తెలియాలంటే ఆయన క్లారిటీ ఇవ్వాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube