నాగబాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది?

అన్నయ్య చిరంజీవి ప్రోత్సాహంతో నాగబాబు నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించాడు.అయితే ఏ ఒక్క సినిమా కూడా ఆయనకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టలేక పోయాయి.

 Nagababu Bad Time Continues-TeluguStop.com

ముఖ్యంగా ‘ఆరంజ్‌’ చిత్రం నాగబాబును కోలుకోలేని దెబ్బ తీసింది.ఆ చిత్రం వల్ల నాగబాబు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

నాగబాబు కోసం పవన్‌ కళ్యాణ్‌ కూడా కొంత మొత్తంలో సాయం చేసినట్లుగా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.ఆరెంజ్‌ దెబ్బ నుండి కోలుకోవడానికి నాగబాబుకు దాదాపు అయిదు సంవత్సరాలు పట్టింది.

ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుండి బయట పడ్డ నాగబాబుకు తాజాగా అల్లు అరవింద్‌ పిలిచి మరీ తన కొడుకు బన్నీతో సినిమా నిర్మించమంటూ ఆఫర్‌ ఇచ్చాడు.

అల్లు అర్జున్‌ డేట్లు ఇవ్వడంతో పెట్టుబడి పెద్దగా పెట్టకుండా, లగడపాటి శ్రీధర్‌తో కలిసి ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని నిర్మించాడు.తక్కువ పెట్టుబడితో ‘నా పేరు సూర్య’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన నాగబాబు ఈ చిత్రంతో అంతో ఇంతో వెనకేసుకోవచ్చు అని భావించాడు.కాని సీన్‌ రివర్స్‌ అయ్యింది.

నా పేరు సూర్య చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.ఏమాత్రం ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే మరియు కథ ప్రేక్షకులకు బోర్‌ కొట్టించింది.

దాంతో సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాలేదు.దానికి తోడు మహానటి చిత్రం విడుదలతో నా పేరు సూర్య చిత్రం కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి.

నాగబాబు ‘నా పేరు సూర్య’ చిత్రం కోసం పెట్టుబడి పెద్దగా పెట్టక పోయినా కూడా విడుదలకు ముందే 10 కోట్లు దక్కించుకున్నాడు.సినిమా విడుదలై సక్సెస్‌ సాధిస్తే మరో 15 నుండి 20 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.

కాని ఫలితం తారు మారు అవ్వడంతో నాగబాబు 10 కోట్లతోనే సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను విడుదలకు ముందే ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల ఈ స్థాయి లాభం వచ్చింది.

మరో నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కూడా ఈ చిత్రం వల్ల నష్టాలపాలు కాలేదని, అంతో ఇంతో మిగుల్చుకున్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

నాగబాబు నిర్మాతగా గతంలో పలు దారుణమైన పరాజయాలు చవి చూశాడు.

నాగబాబు నిర్మించిన ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అయ్యింది.అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా నాగబాబు నిర్మాతగా కొనసాగుతాను అంటూ చెబుతున్నాడు.

అయితే నా పేరు సూర్య చిత్రానికి ఫాలో అయిన ఫార్ములాతోనే నాగబాబు సినిమాలు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.పూర్తి బడ్జెట్‌ తానే పెట్టకుండా సమర్పకుడిగా ఉండటం లేదా తక్కువ పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తే మళ్లీ ఆరంజ్‌ లాంటి దెబ్బ పడదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube