Nagababu Chiranjeevi: అన్నయ్య కోసం దాచినవి నేను దొంగిలించే వాడిని : నాగబాబు

నాగబాబు( Nagababu ) గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విశ్శ్యాలను బయట పెట్టారు.

చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, తన చెల్లెళ్ళ గురించి ప్రస్తావించారు.

ముఖ్యంగా తన తల్లి గురించి చాలా విషయాలను పంచుకున్నారు.చిన్నప్పుడు చిరంజీవి( Chiranjeevi ) గారు భోజనం సరిగ్గా చేసేవారు కాదట.

అందుకే ఆయన అమ్మ ఆయన కోసం ప్రత్యేకంగా మీగడ దాచిపెట్టేదట.కానీ నాగబాబు మాత్రం దొరికినవన్నీ తినేసి మళ్ళి మీగడ దగ్గరకు వెళ్లేవారట.

కానీ నాగబాబుని తిట్టి పంపేసేదట వీరి తల్లి.ఎవరు ఏం తింటారో, ఎవరికి ఏం ఇవ్వాలో ఆవిడ బ్రెయిన్ లో ఎప్పుడు ఉంటుందని అన్నారు నాగబాబు.

Advertisement

ఆమె ఇప్పుడు కూడా వంట చేస్తున్నారా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు పులావ్ అంటే ఇష్టమని, అందులోను అమ్మ చేతి పులావ్ అంటే మరీ ఇష్టమని అన్నారు.ఎంత బిజీగా ఉన్న అప్పుడప్పు అమ్మకు ఫోన్ చేసి ఏదో ఒకటి వండి పంపించమని అడుగుతుంటాడని, ఆమె కూడా అడిగిన వెంటనే వండి పంపిస్తుందని అన్నారు.80 ఏళ్ళ వయసు వచ్చినా.ఇప్పటికి ఆవిడ పిల్లలందరికీ ఏదో ఒకటి వండి పెట్టాలి అనే ఆలోచనలో ఉంటారట.

ఆమె వంట చేసే సమయంలో ఎవ్వరు పక్కన ఏ పని చెయ్యకూడదని, ఆమె వంటను మెడిటేషన్ చేసినట్టు చేస్తారని అన్నారు.

ఐతే చాలా కాలం నుంచి మీ అమ్మ గారిలో మారని విషయం ఏమిటి అని అడగగా ఆమెకు మా చెల్లెల్లు, భార్యల వంటలు నచ్చవని, వాళ్ళు ఎంత బాగా చేసిన ఏదో ఒక వంక పెడతారెంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. తన తల్లికి 14వ ఏట పెళ్లయిందని, అప్పుడు ఆమెకు వంట రాదనీ, కానీ తరువాత తన తండ్రి కోసం, తమ కోసం వంట నేర్చుకుందని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు నాగబాబు.అమ్మ కంటే బాగా వంట ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యలేరని అన్నారు నాగబాబు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు