నా ప్రేమ కథను వేరే హీరోతో తీస్తానంటున్న హీరో...  

Latest News About Tollywood Hero Naga Shourya - Telugu Naga Shourya, Naga Shourya Latest News, Naga Shourya Movie News, Naga Shourya Mvie Latest News, Naga Shourya News, Tollywood Hero Naga Shourya, Tollywood Naga Shourya

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి నాగ శౌర్య గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే చలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు నాగ శౌర్య.

Latest News About Tollywood Hero Naga Shourya

అయితే ఆ తర్వాత సరైన హిట్ లేక పోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు సినీ పరిశ్రమలో తీవ్రంగా శ్రమిస్తున్నారు నాగశౌర్య.

అయితే తాజాగా నాగశౌర్య ‘అశ్వథ్థామ’ అనే చిత్రంలో నటించాడు.

ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన రాబోయే సినిమాలు మరియు  ‘అశ్వథ్థామ’ చిత్ర విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా నాగశౌర్య ఇప్పటికే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ని రాసుకున్నారని ఈ చిత్రాన్ని పట్టాలెక్కి ఇస్తానని చెప్పుకొచ్చాడు.అంతేగాక ఈ చిత్రంలో హీరోగా తాను నటించనని మరో హీరోతో ఈ చిత్రంలో నటింపజేసేందుకు ఇప్పటికే పలు సన్నాహాలు కూడా చేస్తున్నానని తెలిపాడు.అయితే ఇంతకీ  ఆ హీరో ఎవర నేది మాత్రం నాగశౌర్య చెప్పలేదు.అయితే గతంలో కూడా పలు సందర్భాల్లో తాను దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నానని అందుకు సంబందించి  కథను కూడా సిద్ధం చేసుకుంటున్నానని  తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా నటించినటువంటి అశ్వద్ధామ చిత్రం ఈ నెల 31వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన టాలీవుడ్ గ్లామర్ క్వీన్ మెహరీన్ నటించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test