స్పోర్ట్స్ చిత్రానికి ఓటేసిన అశ్వధ్ధామ హీరో

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం తన తాజా చిత్రం అశ్వధ్ధామ రిలీజ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథను కూడా నాగశౌర్య రాసుకోవడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

 Naga Shourya To Do Sports Based Movie-TeluguStop.com

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.అయితే ఈ సినిమా తరువాత శౌర్య తన నెక్ట్స్ మూవీని కూడా ప్లాన్ చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.

సినిమా సినిమాకు మధ్య వెరైటీని చూపుతు తన నెక్ట్స్ మూవీని ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.విలువిద్య ఆట బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం నాగశౌర్య తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయం కూడా తెలియాల్సి ఉంది.ఏదేమైనా నాగశౌర్య ప్రస్తుతం తనలోని విభిన్న షేడ్స్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు.మరి అశ్వధ్ధామ సినిమాతో మనోడు ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube