శ్రీకృష్ణ-సత్యభామ టైటిల్ తో నాగశౌర్య సినిమా

యంగ్ హీరో నాగ శౌర్యప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.గ్యాప్ లేకుండా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

 Naga Shourya New Movie Title Srikrishna Satyabhama, Tollywood, Telugu Cinema, So-TeluguStop.com

ఇప్పటికే సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో లక్ష్య టైటిల్ తో సినిమాని పూర్తి చేశాడు.ఈ సినిమాలో విలువిద్యకారుడుగా శౌర్య కనిపిస్తున్నాడు.

అలాగే ఇప్పటి వరకు కనిపించని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే లేడీ దర్శకురాలితో రీతువర్మకి జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకి వరుడు కావలెను అనే టైటిల్ ని ఎనౌన్స్ చేశారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

దీంతో పాటు సుకుమార్ టీంతో కూడా నాగ శౌర్య పని చేయబోతున్నాడు.ఇదిలా ఉంటే సొంత బ్యానర్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ ని కూడా చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది.

న్యూజిలాండ్ కి చెందిన పాప్ సింగర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి శ్రీ‌కృష్ణ, స‌త్య‌భామ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు.

ఈ టైటిల్ బట్టి అందరూ సినిమా పౌరాణిక కథతో తెరకెక్కుతోందని భావిస్తారు.కానీ సోషల్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా కథాంశం ఉంటుంది.కథ‌ అలాగ‌ని ఇది పౌరాణికం కాదు.సోష‌ల్ కాన్సెప్ట్ తోనే ఉండబోతుందని తెలుస్తుంది.

ప్రేమ కథాచిత్రంగానే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇందులో హీరో పాత్ర స్వభావం శ్రీకృష్ణుడుకి దగ్గరగా ఉంటుందని, అలాగే హీరోయిన్ పాత్ర స్వభావం సత్యభామని పోలి ఉంటుందని తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో కథకి సరిపోయే విధంగా ఉంటుందని శ్రీకృష్ణ-సత్యభామ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube