షూటింగ్ మొదలు పెట్టిన నాగ శౌర్య  

Naga Shourya New Movie Shooting Started, Santosh Jagarlapudi, Northstar Entertainments, Jagapathi Babu, Naga Shourya, Kethika Sharma - Telugu Jagapathi Babu, Kethika Sharma, Naga Shourya, Naga Shourya New Movie Shooting Started, Northstar Entertainments, Santosh Jagarlapudi

లవర్ బాయ్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన హీరో నాగ శౌర్య.రొమాంటిక్ లవ్ స్టొరీలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాగ శౌర్య కెరియర్ లో హిట్స్ భాగానే ఉన్న ఆ క్రెడిట్ ఎక్కువగా అతని ఖాతాలోకి రాలేదు.

TeluguStop.com - Naga Shourya New Movie Shooting Started

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టే హీరోలు ఎవరైనా సోలోగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని సొంతగా మార్కెట్ ఏర్పరుచుకోవాలని అనుకుంటారు.మార్కెట్ లేని హీరోకి ఎన్ని సక్సెస్ లు ఉన్న అతని మీద పది కోట్లు మించి బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఆసక్తి చూపించరు.

TeluguStop.com - షూటింగ్ మొదలు పెట్టిన నాగ శౌర్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు నాగ శౌర్య పరిస్థితి కూడా అలాగే అయ్యింది.నటుడుగా మంచి గుర్తింపు ఉన్నా సొంతగా తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరుచుకోలేకపోయాడు.

ఈ నేపధ్యంలో కమర్షియల్ హీరోగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్నాడు.చలోతో అతనికి సాలిడ్ హిట్ వచ్చింది.

***

అయితే ఈ సినిమా హిట్ తన ఖాతాలోకే వచ్చిన ఆదే జోష్ ని కొనసాగించలేకపోయాడు.

కమర్షియల్ హీరోగా నిలబడటం కోసం తానే రచయితగా మారి కథలు సిద్ధం చేసుకొని సినిమాలు చేసిన వర్క్ అవుట్ కాలేదు.

చివరిగా అశ్వద్ధామ సినిమాతో శౌర్య వచ్చాడు.ఈ సినిమా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సారి మరింత కొత్తగా ప్రయత్నం చేయాలని కంప్లీట్ గా తన ఆహార్యం మార్చేసుకున్నాడు.బాడీ బిల్డ్ చేసి మాస్ లుక్ లోకి వచ్చేశాడు.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం విపరీతంగా కష్టబడుతున్నాడు.నాగ‌శౌర్య 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి.

ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ మొదలు పెట్టారు.కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

పార్థు అనే టైటిల్ సినిమాకి పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది.ఈ సారి పవర్ ఫుల్ పాత్రలో తనని తాను ప్రెజెంట్ చేసుకుంటున్న నాగ శౌర్యకి అతను కోరుకునే మాస్ ఇమేజ్ ఎంత వరకు వస్తుంది అనేది చూడాలి.

#Kethika Sharma #Jagapathi Babu #NagaShourya #Naga Shourya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naga Shourya New Movie Shooting Started Related Telugu News,Photos/Pics,Images..