తెలంగాణ ఎన్నికల వల్ల ఆ సినిమా ఆగిపోయిందట..  

Naga Shourya Movie Was Postponed Due To Telangana Elections-

తెలంగాణలో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తెలుగు సినిమా పరిశ్రమపై కూడా పడుతోంది. పలు సినిమాలపై ఈ ప్రభావం పడుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. కొన్ని సినిమాలకు డైరెక్ట్‌గా ప్రభావం పడుతుంటే మరి కొన్ని సినిమాలకు మాత్రం ఇండైరెక్ట్‌ ప్రభావం పడుతుంది..

తెలంగాణ ఎన్నికల వల్ల ఆ సినిమా ఆగిపోయిందట..-Naga Shourya Movie Was Postponed Due To Telangana Elections

యువ హీరో నాగశౌర్య సినిమాకు మాత్రం డైరెక్ట్‌ ప్రభావం పడినది. నాగశౌర్య హీరోగా కొత్త దర్శకుడితో ప్రారంభం అయిన సినిమా తెలంగాణ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిందట.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఛలో’ చిత్రం తర్వాత ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాణంలో భవ్య క్రియేషన్స్‌లో ఒక చిత్రాన్ని చేసేందుకు నాగశౌర్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ‘నర్తనశాల’ చిత్రం ఇటీవలే విడుదలై ఫ్లాప్‌ అయిన కారణంగా భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ ఈయనతో సినిమా చేసేందుకు కాస్త వెనుకా ముందు ఆడాడు.

ఎట్టకేలకు మంచి కథ సిద్దం అవ్వడంతో సినిమాను మొదలు పెట్టారు. మొదటి షెడ్యూల్‌ పూర్తి పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌కు వెళ్లాల్సి ఉన్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ఈ సినిమాకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా… భవ్య క్రియేషన్స్‌ అధినేత ఆనంద్‌ ప్రసాద్‌ తెలుగు దేశం పార్టీలో కీలక నాయకుడు. ఈయన హైదరాబాద్‌ శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానంకు పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు..

మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానంను టీడీపీ ఆనంద్‌ ప్రసాద్‌కు ఇచ్చేందుకు ఓకే చెప్పారట. దాంతో ఎన్నికల హడావుడిలో ఉన్న ఆనంద్‌ ప్రసాద్‌ నాగశౌర్య మూవీని పక్కకు పెట్టాడట.

నాగశౌర్య, ఈషా జంటగా ప్రారంభం అయిన ఈ చిత్రం మళ్లీ సెట్స్‌ పైకి వెళ్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆనంద్‌ ప్రసాద్‌ ఒకవేళ ఎన్నికల్లో అటు ఇటు అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అదే జరిగితే సినిమా నిర్మాణంను అటకెక్కించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.