కొరియోగ్రాఫర్ ని దర్శకుడుగా పరిచయం చేయబోతున్న నాగశౌర్య -Telugu Tollywood Movie Actor Hero Profile & Biography  

యువ హీరో నాగ శౌర్య గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నాడు.ప్రస్తుతం ఓ వైపు పార్ధు టైటిల్ తో సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తయిపోయింది.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ శౌర్య మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ లుక్ తో దర్శనమిస్తున్నాడు.ఈ సినిమా మీద శౌర్య ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.ఇదిలా ఉంటే మరో వైపు హోం ప్రొడక్షన్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.అలాగే లేడీ డైరెక్టర్ తో రితూ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పుడు మరో సినిమాకి కూడా నాగ శౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అది కూడా ఓ కొరియోగ్రాఫర్ కి.ఢీ డాన్స్ షోతో గుర్తింపు తెచ్చుకొని సినిమాలకి కొరియోగ్రాఫర్ గా మారిన సన్నీమాస్టర్ దర్శకుడుగా మారడానికి దారులు వేసుకున్నాడు.రీసెంట్ గా శౌర్యకి సన్నీ ఓ మంచి కథ చెప్పడం జరిగిందని, ఆ కథతో సినిమా చేయడానికి శౌర్య కూడా ఒకే చెప్పాడని తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి నాగ శౌర్య కేవలం నిర్మాతగానే ఉంటాడని, కొత్తవాళ్లతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ నడుస్తుంది.అయితే నాగ శౌర్య హీరోగానే ఈ సినిమా ఉండబోతుందని మరో చర్చ కూడా నడుస్తుంది.అయితే ఇందులో వాస్తవం ఏది అనేది తెలియాలంటే అధికారికంగా స్పష్టత ఇచ్చే వరకు వేచి చూడాలి.

#Choreographer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Naga Shourya Give Chance To Dance Master Sunny Related Telugu News,Photos/Pics,Images..