సొంత ప్రొడక్షన్ లో నాలుగో సినిమాకి రెడీ అయిన నాగ శౌర్య

యంగ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య ఎలా అయిన కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉండి హీరోగా హిట్స్ కొట్టిన కూడా అందులో చాలా సినిమాల క్రెడిట్ తాకని దక్కలేదు.

 Naga Shourya Fourth Film In Home Banner, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

దీంతో తన సొంత ప్రొడక్షన్ లోనే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కథలతో సోలోగా సక్సెస్ కొట్టి ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ లో తనకంటూ సొంత మార్కెట్ సంపాదించుకోవాలని భావిస్తున్నాడు.సొంత ప్రొడక్షన్ లో చలో సినిమాతో మొదటి సక్సెస్ కొట్టిన తరువాత చేసిన రెండు సినిమాలు నర్తనశాల, అశ్వద్ధామ డిజాస్టర్ అయ్యాయి.

అయితే సినిమాలు ఫ్లాప్ అయిన అవకాశాలు మాత్రం ఇతగాడికి భాగానే ఉన్నాయి.ప్రస్తుతం ముగ్గురు దర్శకులతో సినిమాలు లైన్ లో పెట్టాడు.అందులో అవసరాలతో ఒకటి కాగా లక్ష్మి సౌజన్య అనే దర్శకురాలితో ఒక సినిమా, అలాగే సంతోష్ జాగర్లమూడితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్ లో నాలుగో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

అలాఎలా తో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి రీసెంట్ గా రాజ్ తరుణ్ కి ఫ్లాప్ ఇచ్చిన హవీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.ఈ సినిమా గురించి పూర్తి వివరాలు లాక్ డౌన్ తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
తాజాగా నాగ శౌర్య మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.అలా ఎలా ఫేమ్ హవీష్ కృష్ణ డైరెక్షన్ లో నటించడానికి శౌర్య ఓకే చెప్పాడట.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మించనుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube